Ram Charan New movie: మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ… సూపర్ ‘హిట్’ కాంబో లోడింగ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా చెర్రీ నెక్స్ట్ మూవీ గురించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. మెగా ఫ్యాన్స్ కు ఈ వార్త తప్పకుండా అదిరిపోయే గుడ్ న్యూస్ అవుతుంది. ఓ సూపర్ హిట్ యంగ్ డైరెక్టర్ తో చెర్రీ కాంబోలో ఓ మూవీ లోడింగ్ అవుతోందట. మరి ఆ డైరెక్టర్ ఎవరు ? అసలు ఏంటా కాంబో అనే వివరాల్లోకి వెళ్తే…

గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ ఆర్సీ16లో కనిపించనున్నాడు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ రోల్ పోషిస్తుండగా, ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్ వివరాలు తెలియాల్సి ఉంది. ఇవి ఇప్పటిదాకా రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ గురించి మనకు తెలిసిన వివరాలు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘హిట్’ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలనుతో రామ్ చరణ్ కాంబో లోడింగ్ అవుతోందట.

నిజానికి ప్రస్తుతం చెర్రీ చేతిలో ఉన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ సౌత్ ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్నారు. శంకర్ ప్రస్తుతం రెండు సినిమాల పనుల్లో బిజీగా ఉన్నాడు. ఒకటి ‘గేమ్ ఛేంజర్’ కాగా, మరొకటి కమల్ హాసన్ ‘ఇండియన్ 2’. శంకర్ ‘ఇండియన్2’పై దృష్టి పెట్టి, చెర్రీ సినిమాను నెగ్లెక్ట్ చేస్తున్నారని, అందుకే శంకర్ పర్యవేక్షణలోనే తెలుగు దర్శకుడు శైలేష్ కొలను ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ పూర్తి చేస్తున్నారని సమాచారం. ఇక ఈ మూవీ షూటింగ్ సమయంలోనే శైలేష్ కమిట్మెంట్, పని తీరు, ప్రతిభ నచ్చిన చెర్రీ ఆయనతో నెక్స్ట్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు శైలేష్ కు స్టోరీ కూడా రెడీ చేసుకోమంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారట.

- Advertisement -

ఇక శైలేష్ ఒకవైపు ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ చేస్తూనే, మరోవైపు చెర్రీ కోసం కథపై కసరత్తులు స్టార్ట్ చేశారట. మరి వీరి కాంబోలో మూవీ ‘గేమ్ ఛేంజర్’ తరువాత ఉంటుందా? లేదంటే బుచ్చిబాబు సినిమా కంప్లీట్ చేసి, శైలేష్ తో చెర్రీ చేతులు కలుపుతారా? అనేది తెలియాల్సి ఉంది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు