Ram Charan: పుత్రోత్సాహం

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే తన తండ్రి పేరును నిలబెట్టి రెండవ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ప్రతి సినిమాకు తన స్థాయిని, స్టామినాను పెంచుకుంటూ నేడు పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగాడు రామ్ చరణ్.

రామ్ చరణ్ వ్యక్తిగత విషయానికి వస్తే, ఉపాసనాను పెళ్లికి ముందు రామ్ చరణ్ ను ఓ మీటింగ్ లో కలవడంతో ఆ సమయంలో వారి మధ్య పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది.

వారి మధ్య ఉన్న ప్రేమను కొంతకాలం రామ్ చరణ్ ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా రహస్యంగా ఉంచాడు.ఆ తర్వాత రామ్ చరణ్ సమయం చూసుకొని చెప్పటంతో వెంటనే చిరంజీవి ఓకే చెప్పడంతో 2012 లో చరణ్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది.పెళ్లి జరిగినప్పటినుండి ఈ జంట అంతే అన్యోన్యంగా ఉన్నారు.ఇక వీరి పెళ్లి అయ్యి పదేళ్లు పూర్తవగా ఇప్పటికి వీరికి పిల్లలు లేరన్న విషయం అందరికీ తెలిసిందే.దీంతో ఈ విషయం పట్ల మెగా అభిమానులు చాలా బాధపడుతున్నారు.

- Advertisement -

ఎప్పుడెప్పుడు ఈ జంట తల్లిదండ్రులు అవుతారా అని ఎదురుచూస్తున్నా తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఒక శుభవార్తను పంచుకున్నారు. చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు, రామ్ చరణ్ ఉపాసన కు బిడ్డ పుట్టనున్నట్లు చిరంజీవి ట్విట్టర్ వేదికగా తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు