Ram Charan: ఆ చరణ్ వేరు, ఆ ఆటిట్యూడ్ వేరు

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి(Megasrtar Chiranjeevi) కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక తిరుగులేని స్థాయి ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సగానికి సగం మంది మెగాస్టార్ చిరంజీవిని చూసి ఇన్స్పైర్ వచ్చిన వాళ్లే అని చెప్పాలి. చాలామంది దర్శకులకు మెగాస్టార్ చిరంజీవి ఒక ఇన్స్పిరేషన్. కేవలం దర్శకులకు మాత్రమే కాకుండా చాలామంది నటులకు కూడా మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్. అందుకే అందరూ మెగాస్టార్ చిరంజీవిని తమ ఇంట్లో వాడిగా భావిస్తూ అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల కారణంగా కొన్ని సంవత్సరాలు పాటు సినిమాలకు దూరమైనప్పుడు చాలామంది బాధపడుతూ వచ్చారు. ఆ టైంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా రామ్ చరణ్ తేజ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్(Ram Charan). మొదటి సినిమాతోనే ఎనలేని గుర్తింపును సాధించుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత చేసిన మగధీర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా చరిత్రలోనే సినిమాలన్నీ రికార్డులను మగధీర సినిమా తిరగరాసింది. అక్కడితోనే స్టార్ హీరో అయిపోయాడు రామ్ చరణ్. కమెడియన్ సునీల్ కూడా ఒక సందర్భంలో మిమ్మల్ని దాటేసాడు అన్నయ్య అంటూ చెప్పాడు. ఆ సినిమా తర్వాత చేసిన ఆరెంజ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

Ramcharan

- Advertisement -

అయితే ఇండస్ట్రీలో సక్సెస్,ఫెయిల్యూర్ అనేవి కామన్ గా జరుగుతూ ఉంటాయి. అలానే మెగాస్టార్ చిరంజీవి తనయుడు కాబట్టి అతనిపైన ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అప్పట్లో రామ్ చరణ్ తేజ్ పేరు చాలా వివాదాల్లో వినిపిస్తూ వచ్చేది. అలానే చాలా కథనాలు కూడా రామ్ చరణ్ తేజ్ పైన పర్సనల్ అటాకింగ్ చేస్తూ రాస్తూ వచ్చేది అప్పటి మీడియా. నాయక్ సినిమా రిలీజ్ టైం లో కూడా మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి మధ్య చెడింది అంటూ చాలామంది వార్తలు రాస్తూ వచ్చారు. వీటన్నిటికీ నాయక్ సినిమా ఆడియో లాంచ్ లో రామ్ చరణ్ తేజ్ సమాధానం ఇచ్చారు.

అప్పటి చరణ్ వేరు ఆటిట్యూడ్ వేరు

మాకు మా బాబాయ్ కి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో, మా బాబాయ్ కి నాకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో అది మాకు తెలుసు. ఏ ఒక్క మీడియా ఛానెల్ గాని మా మధ్య ఉన్న సంబంధాన్ని విడదీయలేదు. ఇన్ని చెప్పినా కూడా మీరు మా గురించి రాస్తూనే ఉన్నారు. అవి మీరు రాసిన కూడా అవి మాకు ఒక వెంట్రుక అంటూ చెప్పుకొచ్చాడు. అంత ఆటిట్యూడ్ తో అగ్రెసివ్ గా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు. కానీ ప్రస్తుతం చేరన్ డిసిప్లిన్ కి కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు. ఉన్నతమైన స్థానంలో ఉంటున్నారు కాబట్టి కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోవడం మానేశాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మొన్న ఇదే డైలాగ్ ని వాడుతూ మీ ఫేవరెట్ హీరో చెప్పిన మాటలే అంటూ గుర్తు చేశారు. ఈ వీడియోని షేర్ చేస్తూ చాలామంది నెటిజెన్స్ అప్పటి చరణ్ వేరు ఆటిట్యూడ్ వేరు అంటూ మరోసారి గుర్తు చేసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు