Ram Charan – Upasana: మరోసారి గొప్ప మనసు చాటుకున్న మెగా కపుల్.. ఆనందంలో ఫ్యాన్స్..!

Ram Charan – Upasana:మెగా కుటుంబం అనగానే సహాయానికి మారు పేరు అని సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు , అభిమానులు కూడా తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి సైతం ఎన్నో సహాయాలు చేసిన ఘనతను కూడా పొందారు. అలాగే మిగతా హీరోలు కూడా వారికి తోచినంత సహాయాన్ని చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న హీరోలలో రామ్ చరణ్ ,అల్లు అర్జున్, సాయి ధరంతేజ్ తదితర హీరోలు సైతం తమ వంతు సహాయంగా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ మరొక సారి తన గొప్ప మనసుని చాటుకున్నారు.

Ram Charan - Upasana: Once again mega couple who showed great heart.. Fans in joy..!
Ram Charan – Upasana: Once again mega couple who showed great heart.. Fans in joy..!

500 కుటుంబాలకు అండగా రామ్ చరణ్ – ఉపాసన..

రామ్ చరణ్ – ఉపాసన ఇద్దరూ కలిసి ఏకంగా 500 కుటుంబాలకు సహాయాన్ని అందించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల తెలియజేశారు. తన పుట్టినరోజు సందర్భంగా చిరంజీవితో పాటు రామ్ చరణ్, ఉపాసనల ను ప్రత్యేకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా డాన్సర్స్ యూనియన్ లో 500 కుటుంబాలకు సైతం హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని మెగా కపుల్స్ మాట ఇచ్చారట.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా జానీ మాస్టర్ తెలియజేయడం జరిగింది. అలాగే నా పుట్టినరోజు నాడు.. రామ్ చరణ్ అన్న.. నన్ను తన ఇంటికి పిలిచినప్పుడు చాలా ఆనందం కలిగింది అంటూ తెలిపారు జానీ మాస్టర్.

మాట నిలబెట్టుకున్న మెగా కుటుంబం..

అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవిని కలిసే భాగ్యం కూడా కలిగిందనీ . తన అన్న రామ్ చరణ్ , వదిన ఉపాసన తనకు ఇచ్చిన మాటకి చాలా సంతోషం కలిగిందని.. అడిగిన సహాయాన్ని గుర్తుచేసుకొని మరి..TFTTDA లో 500 మందికి పైగా కుటుంబాలలోని వారికి హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా చేశారని వారి ఆరోగ్యానికి అండగా నిలబడ్డారని తెలిపారు.. అడిగిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న మెగా కుటుంబానికి.. కృతజ్ఞుడు నీ అయి ఎల్లప్పుడూ ఉంటాను అంటూ తెలియజేశారు జానీ మాస్టర్.

- Advertisement -

జీవితాంతం రుణపడి ఉంటా..

అలాగే వారందరి తరఫున అన్న వదినలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ జానీ మాస్టర్ తెలిపారు. అయితే ఈ విషయం విన్న అటు అభిమానులు , ఇటు సినీ సెలబ్రెటీలు సైతం మెగా కపుల్స్ చేసిన సహాయానికి శభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు.. అంతేకాకుండా గతంలో కూడా ఉపాసన ఎన్నో అనాధ ఆశ్రమాలను చేరదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రామ్ చరణ్ కూడా చాలా వాటికి విరాళాలు అందించిన సందర్భాలు కూడా అప్పుడప్పుడు మనం వింటూనే ఉంటాము.. చిరంజీవి కుటుంబం అనగానే సహాయానికి మారుపేరు అనే అంతగా పాపులారిటీ సంపాదించుకుంది. ఏది ఏమైనా మెగా కుటుంబం అటు సినిమాల ద్వారా ఇటు నలుగురికి సహాయాన్ని అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు