Ram Charan With Pawan Kalyan : బాబాయ్‌ని తాకలంటే అబ్బాయిని దాటాలి

Ram Charan With Pawan Kalyan: ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సాధించుకున్నాడు రామ్ చరణ్ తేజ్. చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే చిరు తనయుడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా రామ్ చరణ్ తేజ్ ను స్టార్ హీరోను చేసేసింది. రామ్ చరణ్ నటించిన చిరుత సినిమా టైంలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో చాలామందికి అర్థం అయింది. ఆ ఇంటర్వ్యూలో ఎవరికి తెలియని కొన్ని విషయాలను కూడా పంచుకున్నారు రామ్ చరణ్ తేజ్. పవన్ కళ్యాణ్ తమ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళని అవి వడ్డీతో సహా ఇస్తాను అని చెప్పే వాళ్ళని అంటూ ఇలా చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

నన్ను దాటి అన్నయ్య దగ్గరికి వెళ్లండి – పవన్

ఇకపోతే ఒక టైం లో మెగా ఫ్యామిలీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మధ్య విభేదాలు వచ్చాయని చాలా పత్రికలు రాసాయి. చాలా కథనాలు కూడా వినిపించాయి. అయితే వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్ అనే సినిమా ఆడియో లాంచ్ లో వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ తరపున సరైన సమాధానం చెప్పాడు రామ్ చరణ్ తేజ్. అసలు రామ్ చరణ్ తేజ్ లో అంత ఫైర్ ఉందని ఆ రోజు చాలా మందికి తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి గారు పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏదైనా ఒక ఇష్యూ జరిగితే ఒక ఆరా లాగా కళ్యాణ్ బాబాయ్ నిలుచునేవాడు. “ఏదైనా ఉంటే ముందు నాతో మాట్లాడండి నన్ను దాటి అన్నయ్య దగ్గరికి వెళ్ళండి” అని చెప్పేవారు.

నన్ను దాటి బాబాయ్ దగ్గరికి వెళ్లండి – చరణ్

అలానే నేను ఈరోజు చెప్తున్నా “ఏదైనా ఉంటే ముందు నాతో వచ్చి మాట్లాడండి. నన్ను దాటి కళ్యాణ్ బాబాయ్ దగ్గరికి వెళ్ళండి” అంటూ ఆరోజు స్టేజ్ పైన చెప్పుకొచ్చాడు. ఒక ఫంక్షన్ కి కళ్యాణ్ బాబాయ్ రాలేదు అని చాలా పత్రికలు చాలా వార్తలు రాసాయి. మీరు రాసిన ఒక వార్త మా మధ్య ఉన్న బంధాన్ని అనుబంధాన్ని వేరు చేయలేవంటూ ఆ రోజుల్లోనే రామ్ చరణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అని చెప్పొచ్చు. మీరు ఏం రాసినా కూడా ఒక వెంట్రుక అంటూ కూడా దీటుగా సమాధానం ఇచ్చాడు ఆ రోజుల్లోనే.

- Advertisement -

అయితే తరువాత సినిమాలు చేస్తున కొద్ది రామ్ చరణ్ ఫైర్ ను అణుచుకున్నాడు అని చెప్పొచ్చు. వేదిక ఎక్కితే తక్కువగా మాట్లాడి డీసెంట్ గా తన పని తాను చేసుకుంటూ కెరియర్లో ముందుకు వెళ్లిపోతున్నాడు రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ తేజ్ కెరియర్ లో వచ్చిన సినిమా రంగస్థలం ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ సినిమా కెరియర్ విషయానికి వస్తే రంగస్థలం ముందు రంగస్థలం తర్వాత అని చెప్పొచ్చు అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

నా తమ్ముడి లాంటి వాడు – పవన్

ఈ ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ చిట్టి బాబు అనేవాడు నా తమ్ముడు లాంటివాడు, మా వదిన నాకు అమ్మ, మా అన్నయ్య నాకు నాన్న అంటూ చెప్పకు వచ్చాడు. అలా చెప్పుకు రావడమే కాకుండా పవన్ కళ్యాణ్ కి ఉన్న రామ్ చరణ్ మీద ఉన్న ప్రేమను అంతటినీ కూడా ఆ మాటల్లో తెలిపాడు. అక్కడితో బాబాయి అబ్బాయి మధ్య బాండింగ్ ఏంటో చాలామందికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా చాలామంది సినిమా ప్రముఖులు వస్తూ తమ వంతు ప్రచారం చేస్తున్నారు. అలానే చాలామంది ట్విట్టర్ వేదికగా కూడా పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన మద్దతును ట్విట్టర్ వేదిక తెలియజేశారు.

బాబాయ్ కోసం

ఇకపోతే ఈ టైం లో చాలామంది మెగా హీరోస్ పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తూ వెళ్లారు. తాజాగా రామ్ చరణ్ తేజ్ కూడా పిఠాపురం వచ్చారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ కి గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ ఉంది. చరణ్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు ఇంతటి స్టార్డంను సాధించి కూడా బాబాయి పైన అదే అభిమానం ఇప్పటికీ చరణ్ కి ఉంది అని చెప్పొచ్చు. ఏదేమైనా ఎక్కువసార్లు వేదికలపై కనిపించకపోయినా, ఎక్కువ చనువుగా కనిపించకపోయిన కూడా వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు