Ram Charan : గేమ్ ఛేంజర్‌కు విలన్ శంకర్ ఒక్కరే కాదు… కనిపించని మరో శత్రువు ఉన్నాడు

Ram Charan : భారతీయుడు 2 రిలీజ్ అయింది. మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ వస్తుంది. 3 గంటల సినిమా ఆడియన్స్ ఎక్కడా కూడా ఎక్కలేదు. అంతే కాదు.. సినిమా మొత్తం ల్యాగ్ ఉందని, శంకర్ మార్క్ ఎక్కడా కనిపించలేదని రివ్యూలు వచ్చాయి. సాధారణ ఆడియన్స్ కూడా దాదాపు ఇలాంటి రెస్పాన్సే ఇస్తున్నారు. ఇది కమల్ హాసన్ అభిమానులకు కొంత వరకు నచ్చకపోయినా, భారతీయుడు 3 కి వస్తున్న ఇంట్రెస్ట్ తో కొంత వరకు కవర్ అవుతుంది.

సినిమా మొత్తంలో చివరి వచ్చే భారతీయుడు 3 ట్రైలర్ సూపర్ ఉంది అని అంటున్నారు. ఈ భారతీయుడు 2లో చెప్పుకునే పాజిటివ్ పాయింట్ అది ఒక్కటి మాత్రమే.

నిజానికి ఈ సినిమా బాగుంటే.. ఫస్ట్ ప్లస్ పాయింట్స్‌లో కమల్ హాసన్ అని చెప్పుకుంటే… నెక్ట్స్ డైరెక్టర్ శంకర్.. ఆ తర్వాత… మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పేరు చెప్పుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు వాళ్లే సినిమాకు మైనస్ అయ్యారు. ఇది ఇక్కడికే ఆగలేదు. ఈ టెన్షన్ అంతా ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ట్రాన్స్‌ఫర్ అయింది. ఎందుకంటే.. రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. దానికి డైరెక్టర్.. ఇప్పుడు భారతీయుడు 2 అని ఓ డిజాస్టర్ మూవీ చేసిన శంకరే.

- Advertisement -

దీంతో గేమ్ ఛేంజర్ మూవీకి శంకరే విలన్ అయ్యేలా ఉన్నాడు అని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. అయితే నిజానికి గేమ్ ఛంజర్ సినిమాకు విలన్ శంకర్ ఒక్కరే కాదు. మరొకరు కూడా ఉన్నారు. ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.

సాధారణంగా సినిమాలకు డైరెక్టర్ నుంచి ఫెయిల్యూర్ వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసి, ఆడియన్స్‌తో ఈలలు వేయించవచ్చు. నిజానికి అనిరుధ్ చాలా సినిమాల్లో అలా జరిగింది. కానీ, ఇక్కడ భారతీయుడు 2కి వచ్చే సరికి అదే కనిపించలేదు. సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చినట్టు ఎక్కడా అనిపించలేదు. దీంతో శంకరే ఒక్కరే కాదు.. రామ్ చరణ్ ఫ్యాన్స్ ను వెన్నుపోటు పొడవడానికి అనిరుధ్ కూడా రెడీగా ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు