GameChanger : వినాయకచవితి శుభాకాంక్షలతో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు…కానీ?

GameChanger : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ షణ్ముగం (Shankar Shanmugam) దర్శకత్వంలో తెరకెక్కుతున్న “గేమ్ ఛేంజర్” సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ మొత్తం పూర్తయిపోయినా, చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వకుండా ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షించారు. అప్పుడెప్పుడో ఒక ఫస్ట్ లుక్ పోస్టర్, ఓ లిరికల్ సాంగ్ మినహా మరే అప్డేట్ కూడా రాలేదు. ఈ క్రమంలో రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ చిత్ర యూనిట్ పై సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. రీసెంట్ గా థమన్ (Thaman) కూడా చరణ్ అభిమానుల్ని శాంతింపచేస్తూ, ఇలా నెగటివ్ ట్రెండ్ చేయకండని బతిమిలాడుకున్నాడు. ఏది ఏమైనా ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Ram Charan's GameChanger Movie Second Song Update

అదిరిపోయే లుక్ తో క్రేజీ అప్డేట్…

ఇక గత కొన్ని రోజులుగా వినాయకచవితికి గేమ్ ఛేంజర్ (GameChanger) అప్డేట్ వస్తుందని వార్తలు రాగా, ఫైనల్ గా బాగా వెయిట్ చేయించి, ఒక సాలిడ్ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ డాన్స్ మూమెంట్ లో ఉన్న ఒక పోస్టర్ ని చిత్ర యూనిట్ వదలగా, ఆ పోస్టర్ లో రామ్ చరణ్ స్టైలిష్ గా ఉన్నాడు. తలకు ఎర్ర కండువా కూడా చుట్టుకుని ఉండగా, వెనకాల జాతర సెలబ్రేషన్స్ చేస్తున్నట్టు ఉంది. ఇక ఈ లుక్ రామ్ నందన్ IAS లుక్ అని తెలుస్తుంది. మొత్తానికి ఈ పోస్టర్ లో రామ్ చరణ్ అదిరిపోయాడని చెప్పాలి. ఇక ఈ పోస్టర్ లో గేమ్ ఛేంజర్ నుండి రెండో లిరికల్ సాంగ్ సెప్టెంబర్ లో రాబోతుందని ప్రకటించారు. అయితే ఆ సాంగ్ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు మేకర్స్. అయితే చరణ్ ఫ్యాన్స్ మాత్రం పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేరని తెలుస్తుంది.

- Advertisement -

చరణ్ ఫ్యాన్స్ కి కిక్కెక్కలేదా?

ఇక తాజాగా గేమ్ ఛేంజర్ నుండి ఇచ్చిన అప్డేట్ తో రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా సంతోషిస్తారని అనుకున్నా, చరణ్ ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో సంతృప్తితో లేరని తెలుస్తుంది. ఎందుకంటే రిలీజ్ చేసిన పోస్టర్ లో గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ని మెన్షన్ చేయలేదు. కనీసం టీజర్ అప్డేట్ కూడా ఇవ్వలేదు. పోనీ రెండో లిరికల్ సాంగ్ అప్డేట్ అయినా సరిగా ఇచ్చారా అంటే, సాంగ్ రిలీజ్ ఎప్పుడో చెప్పలేదు. ఓవరాల్ గా వినాయకచవితికి ఓ పోస్టర్ తో చరణ్ ఫ్యాన్స్ సంతృప్తి పడేలా చేశారు. మరి ఈ రెండో సాంగ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం ముందుగా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్ లో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించగా, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, నవీన్ చంద్ర, సునీల్, జయరాం, సముద్రఖని వంటి భారీ తారాగణం సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు