Ram Charan Upasana: రామ్ చరణ్ తాతకు కారు ప్రమాదం… షాక్‌లో ఉపాసన

Ram Charan Upasana : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ గా కొనసాగుతున్న వారిలో ఉపాసన , రామ్ చరణ్ కూడా ఒకరు. ఇక ఇటీవల వీరికి క్లీంకారా అనే కూతురు కూడా జన్మించిన సంగతి తెలిసిందే. క్లీంకారా జన్మించిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీలో సంతోషాలు విరజల్లాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ తాతకు కారు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. చెన్నైలో ఓ వ్యాన్… ప్రతాప్ రెడ్డి కారు పైకి దూసుకు రాగా ఆయన త్రుటి లో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక ఈ ఘటనపై చెన్నైలో కేసు నమోదయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Ram Charan's grandfather had a car accident
Ram Charan’s grandfather had a car accident

కాగా రామ్ చరణ్ భార్య ఉపాసనకు ప్రతాప్ రెడ్డి తాత అవుతారు. ప్రస్తుతం ఉపాసన అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక ఈ ప్రమాదం తెలియడంతో మెగా ఫ్యామిలీ అంతా షాక్‌ కి గురయింది. ఇక ప్రతాప్ రెడ్డి ప్రాణాలకి ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో మెగా ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం ఉపాసన తన తాత ప్రతాప్ రెడ్డి దగ్గరికి వెళ్లేందుకు బయలుదేరింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు