Ram Gopal Varma : యువర్ ఫిల్మ్ అప్డేట్ ఇచ్చిన ఆర్జీవీ… లిస్ట్ బయటకొచ్చింది ఎప్పుడంటే?

Ram Gopal Varma : సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ యువర్ ఫిల్మ్ అంటూ కొత్త ప్రయోగాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కాన్సెప్ట్ లో సెలెక్ట్ అయిన వారి గురించి సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చారు ఆర్జీవి. మరి ఇందులో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు? ఆ లిస్ట్ ఎప్పుడు బయటకు వస్తుంది? అనే వివరాల్లోకి వెళితే…

యువర్ ఫిలిం కొత్త అప్డేట్

రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన దర్శకత్వం వహించే సినిమాలతో పాటు హీరోయిన్లను చూపించే విధానం వరకు వర్మ శైలి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే ఇప్పటిదాకా కొన్ని ఐకానిక్ సినిమాలను తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ ఇటీవల కాలంలో కాంట్రవర్సీ, బోరింగ్ సినిమాలకు పరిమితమయ్యారు అనే విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే వర్మ ఈసారి ప్రేక్షకులతోనే సినిమా తీయాలని నిర్ణయానికి వచ్చి యువర్ ఫిలిం అనే ఒక కొత్త ప్రయోగాన్ని తెరపైకి తీసుకువచ్చాడు. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు ఆర్జీవి.

యువర్ ఫిలిం సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్తూనే మొత్తం 319 సబ్మిషన్స్ ఉండగా, అందులో 50 సబ్మిషన్స్ డైరెక్టర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి వచ్చాయని సోషల్ మీడియా వేదికగా తెలిపారు ఆర్జీవి. అయితే ఈ 50 సబ్మిషన్స్ లో 10 మంది డైరెక్టర్స్, 10 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ని షార్ట్ లిస్టు చేశామని, దీనికి సంబంధించిన లిస్టు ను జూన్ 9న వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. అలాగే నటీనటులు, సినిమాటోగ్రాఫర్స్ అండ్ రైటర్స్ కు సంబంధించిన టెస్టులను కూడా ఆర్జీవి డెన్ డాట్ కామ్ లో చూడొచ్చని క్లారిటీ ఇచ్చారు. మరి ఆర్జీవితో పని చేసే అదృష్టం ఎవరెవరిని మరిచిందో తెలియాలంటే జూన్ 9 వరకు ఆగాల్సిందే.

- Advertisement -

Filmmaker Ram Gopal Varma unveiled his new office RGV DEN in Hyderabad

అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి?

ఏప్రిల్ 6 న ఆర్జివీ డెన్ వేదికగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ యువర్ ఫిలిం అనే కాన్సెప్ట్ ని ప్రెస్ మీట్ ద్వారా వివరించారు. ప్రేక్షకులే సాధారణంగా సినిమా హిట్టా ప్లాఫా అనే విషయాన్ని నిర్ణయిస్తారు. కాబట్టి ఆ ప్రేక్షకులే సినిమాకు సంబంధించిన హీరో, హీరోయిన్, డైరెక్టర్, సినిమా యాక్టర్ ను ఓటింగ్ పద్ధతిలో ఎంపిక చేయాలని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ప్రజలే ఎన్నుకున్న వారితో రాంగోపాల్ వర్మ నిర్మాతగా 6 నెలల్లో మూవీని తీసి రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కథను ఆర్జీవి వెబ్సైట్లో ఒక రెండు లైన్లు పెట్టి, ఆ కథ లైన్ నచ్చిన యాక్టర్స్, డిఓపి, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

అప్లై చేసుకున్న ప్రతి డిపార్ట్మెంట్ కు సంబంధించిన వారిలో ఎవరి వర్క్ నచ్చిందో వారిని ఓటింగ్ పద్ధతిలో ప్రేక్షకులు ఎన్నుకుంటారన్నమాట. అనంతరం సెలెక్ట్ అయిన వారికి రాంగోపాల్ వర్మ టాస్కులు పెట్టి ఆడిషన్స్ తీసుకుంటారు. ఆ ఆడిషన్స్ లో ప్రేక్షకులకు ఎక్కువగా ఎవరు నచ్చితే వాళ్లని పెట్టి సినిమా తీస్తారన్నమాట. ప్రస్తుతానికి ఈ పద్ధతిలో సెలెక్ట్ అయిన డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ పదేసి మంది సెలెక్ట్ అయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు