Ram Gopal Varma : ఫ్రెండ్స్ కాదు ఎనిమీస్… మరో వివాదానికి తెరలేపిన వర్మ ట్వీట్..

Ram Gopal Varma : తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలే కాదు.. మాటలు కూడా వివాదాలను కొని తెచ్చిపెడతాయి.. ఆయన సోషల్ మీడియా వేదికగా నెట్టింట చర్చనీయాంశంగా మారుతారు.. వర్మ ట్వీట్స్ బుల్లెట్స్ కన్నా పవర్ ఫుల్ గా ఉంటాయి. అందుకే ఆయన నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాడు.. తాజాగా వర్మ మరో వివాదానికి తెరలేపాడు.. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఫ్రెండ్షిప్ డే ట్వీట్ సంచలనంగా మారింది.. అంతేకాదు ప్రస్తుతం దీనిపై ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తుంది..

ఆర్జీవి సినిమాలు ఈ మధ్య మాములుగా లేవు యువతను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి.. బోల్డ్ కంటెంట్ సినిమాలు తీయడం ఆయనకు కొత్తేమీ కాదు.. జనాలకు నచ్చే విధంగా సినిమాల కన్నా కూడా కోపం తెప్పించే సినిమాలను తెరకెక్కించి అందరిచేత చివాట్లు తింటాడు.. అయినా ఎక్కడా తగ్గడు.. ఈ కొత్త కంటెంట్ ను వెతుక్కొని మరి క్రియేట్ చేస్తాడు.. అందుకే ఆర్జీవి పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లు ఉంటుంది. తాజాగా నేడు ఫ్రెండ్షిప్ డే సందర్బంగా అందరు తమ స్నేహితులకు ప్రత్యేక విషెస్ చెబుతారు. కానీ వర్మ మాత్రం ఈరోజును ఎనిమిస్ డే అని ప్రకటించారు. ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది..

ram gopal varma special tweet on friendship day
ram gopal varma special tweet on friendship day

ఆ ట్వీట్ లో ఏముందంటే ఫ్రెండ్షిప్ డే అంటే ఎనిమీస్ డే అంటూ రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. దీంతో వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు.. ఇకపోతే వర్మకు మెగా ఫ్యామిలీకి అసలు పడదు అనే సంగతి తెలిసిందే.. అది ఇప్పటిలో మాట అప్పటిలో మాత్రం ఓ రకంగా సినిమాలను చేస్తుండేవారు. కాగా చిరంజీవి తో వర్మ సినిమా ఆగిపోయిందని టాక్ వినపడుతుంది.. వర్మ గారు ప్రస్తుతం బోల్డ్ కంటెంట్ మూవీలను ఎక్కువగా తెరకేక్కించేందుకు కొత్త బ్యూటిలను ఇండస్ట్రీలోకి దించుతున్నారు.. కొన్ని సినిమాలు బూతులు అనే టాక్ ను కూడా అందుకున్నాయి.. కానీ వర్మ మాత్రం నా ఇష్టం అంటూ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు