Ram Gopal Varma : తెలుగు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సినిమాల కన్నా ఎక్కువగా వివాదాలతో ట్రెండ్ అవుతున్నాడు. ఆయన ఏం చేసిన సెన్సేషన్ అవుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న వర్మ పోస్టులు పెడుతూ రచ్చ చేస్తుంటారు.. వర్మ ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి.. ఆయన ఏం చేసిన కొత్తగా చేస్తాడు. కొన్ని పోస్టులు ఎంత దుమారం రేపుతాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వర్మ కాంపౌండ్ లో అందమైన అమ్మాయిలు ఉంటారు.. వర్మ ఎంతో మంది హీరోయిన్స్ ను స్టార్స్ గా మార్చారు. ఆయన అందమైన ముద్దుగుమ్మలతో ఫోటోలను దిగుతూ రచ్చ చేస్తారు. ఆ ఫోటోలు ఎంతగా దుమారం అవుతాయో చూశాం..
ఇక ఆర్జీవి ఏదైన ముక్కు సూటిగా చెప్పడం మాత్రమే కాదు. తనకు నచ్చిన దాన్ని పబ్లిక్ గానే చేస్తాడు. సోషల్ మీడియాలో ఆయనకు పెద్ద ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడు ఎలాంటి ట్వీట్ చేస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. ఈ క్రమంలో తాజాగా వర్మ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ ట్వీట్ లో.. మీరు తెలుసుకోవాలనుకుంటే, మీకు తెలియనిది, మీరు దీన్ని తెలుసుకోవాలి.. “నాకు తెలిసినది, నేను తెలుసుకోవాలనుకుంటున్నది.. నాకు తెలియనిది నాకు తెలుసు, నేను తెలుసుకోవలసినది నాకు తెలియదు. నాకు తెలియనిది నేను తెలుసుకున్న రోజు, అది కూడా నాకు తెలుసు, అదే నేను అర్థం చేసుకున్నాను. నాకు తెలిసినవి, నాకు తెలియనివి అన్నీ నాకు తెలుసు అని చెప్పినప్పుడు”.. అని అర్థం కాకుండా ట్వీట్ లో రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఏంటి.. వర్మ ఒడ్కా తాగుతూ ఇది రాశావా అని కొందరు కామెంట్ చెయ్యగా, మరికొందరు మాత్రం మంచి బిజీగా ఉండి ఎవరికో చెప్పాల్సింది ట్వీట్ చేశావా అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట దుమారం రేపుతుంది. నిజంగా ఇలాంటివి వర్మకే సాధ్యం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్జీవీ డెన్ పేరుతో కొత్త ఆఫీస్ ఓపెన్ చేశాడు. వర్మ ఆఫీస్ తన అభిరుచికి తగ్గట్లు అద్భుతంగా ఉంది… ఆ డెన్ ఫోటోలు కూడా ఓ రేంజులో వైరల్ అయ్యాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. వర్మ వ్యూహం సినిమా చేశారు. అది భారీ డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు మరో కొన్ని పొలిటికల్ సినిమాలను చేస్తున్నాడు. డేంజరస్ అనే బోల్డ్ మూవీ చేశాడు. అది ఎలా పోయిందో కూడా తెలియలేదు. ఇప్పుడు సినిమాలను అనౌన్స్ చెయ్యకుండా మూడు ప్రాజెక్టులను చేస్తున్నట్లు సమాచారం.
If u want to know ,what u don’t know, u should know this
“I know what I know and what I want to know and what I do not know I will not know that I should know and the day I come to know what I did not know, I will know that too, which is what I meant when I said that I know…
— Ram Gopal Varma (@RGVzoomin) August 7, 2024