Vyooham Postponed: మళ్ళీ “వ్యూహం” వాయిదా… ఈసారి ఏం అడ్డుపడిందంటే?

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన పొలిటికల్ డ్రామా “వ్యూహం” మూవీ మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ రోజు అంటే ఫిబ్రవరి 23న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా హఠాత్తుగా వాయిదా పడి ఆర్జీవీకి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఐమాక్స్ ఈ మూవీ బుకింగ్స్ ను తొలగించింది. ఆర్జీవి మాత్రం ఈ మూవీ ఆగిపోవడానికి గల కారణాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్ పై దాసరి కిరణ్ కుమార్ “వ్యూహం” సినిమాను నిర్మించారు. అజ్మల్, మానస ప్రధాన పాత్రలు పోషించారు. ఏపీ రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ “వ్యూహం” మొదటి పార్ట్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం మొదలుకొని, ఆయన కుమారుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఉండబోతుందని ఇప్పటికే ఆర్జీవి వెల్లడించారు. అయితే “వ్యూహం” సినిమాకు మొదటి నుంచి పలు అడ్డంకులు ఎదురవుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి సానుకూలంగా, టిడిపి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు ప్రతికూలంగా రాబోతున్న నేపథ్యంలో “వ్యూహం” రిలీజ్ ను నిలిపివేయాలంటూ నారా లోకేష్ గతంలో కేసు వేసిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల క్రితం లోకేష్ కేసు కారణంగా ఈ సినిమాను కోర్టు నిలిపివేయగా, ఆ అడ్డంకులను అధిగమించి ఫిబ్రవరి 23న”వ్యూహం” సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాడు. ఇక ఇప్పుడు ఎలాంటి సమస్యా లేకుండా ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని అనుకుంటున్న తరుణంలో వర్మ అందరికీ షాక్ ఇచ్చాడు.

- Advertisement -

“వ్యూహం” సినిమాను మార్చి 1కి, శబధం మూవీని మార్చి 8కి వాయిదా వేస్తున్నట్టు స్వయంగా ఆర్జీవి ప్రకటించాడు. అయితే ఈసారి సినిమా వాయిదా పడడానికి కారణం లోకేష్ కాదని, కొన్ని సాంకేతిక కారణాలని తెలిపారు. అలాగే మరిన్ని ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టడం కోసం, తాము కోరుకున్నన్ని థియేటర్లలో రిలీజ్ చేయడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంటూ వర్మ ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 23న సుమారు తొమ్మిది సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో “వ్యూహం” సినిమాకు ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశం లేని కారణంగా వాయిదా వేస్తున్నట్టు ఆర్జీవి తెలిపారు.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos,and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు