Ram – Laxman : వాటి కోసం మేమెప్పుడూ ఆశపడలేదు – రామ్ లక్ష్మణ్ మాస్టర్స్..

Ram – Laxman : టాలీవుడ్ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒక్క టాలీవుడ్ లోనే కాదు సౌత్ మొత్తం ఎంతో మంది స్టార్ హీరోలకు ఫైట్ కొరియోగ్రఫీ చేస్తూ స్టార్ ఫైట్ మాస్టర్లుగా రానిస్తున్నారు. ఇప్పటికి చిరంజీవి, రజినీకాంత్ వంటి లెజెండరీ హీరోలు ఫైట్స్ విషయానికి వస్తే.. తమ సినిమాల్లో రామ్ లక్ష్మణ్ మాస్టర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు దాదాపు అగ్ర హీరోలందరికీ స్టంట్ మాస్ట‌ర్లు గా పనిచేసారు వీరిద్దరూ. భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ లు చేయాలంటే రామ్ ల‌క్ష్మ‌ణ్ లు ఉండాల్సిందేనని స్టార్ హీరోలు సైతం ప‌ట్టుబ‌డ‌తారు. వీళ్ళ పనితనానికి తోడు మూడు దశాబ్దాలుగా వీళ్ళ అనుభవం ఈ ఫైట్ మాస్టర్లకు ఎంతో నేర్పిందని అంటుంటారు. ఇక వీరిద్దరూ క‌వ‌ల‌ సోదరులని తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి వచ్చి ఈ స్థాయికి ఎదిగారు. పెద్ద‌గా చదువ‌కోలేదు కూడా. అయినా కృషితో నాస్తి దుర్బిక్షం అన్న‌ట్లు ఇండస్ట్రీలో స్వయంకృషితో స‌క్సెస్ అయ్యారు. తాజాగా రామ్ ల‌క్ష్మ‌ణ్ ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు.

Ram - Laxman interesting comments in the latest interview

ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం – రామ్ లక్ష్మణ్

ఇక తాజాగా ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ (Ram – Laxman) మాస్టర్లు ఓ ఇంటర్వ్యూ లో ఇండస్ట్రీ గురించి తమ అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్బంగా రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీకి కొత్తవారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది, కొత్తవారు వస్తున్నారు. మమ్మల్ని పక్కన పెడుతున్నారని మేము బాధపడటం లేదు. అలాంటి ఆలోచ‌న కూడా రానివ్వం. మేము అనుకున్న దానికంటే ఇండస్ట్రీ మాకు ఎక్కువగానే ఇచ్చింది. అందుకు మేము సినిమా ఇండస్ట్రీకి ప్రత్యకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎక్క‌డో సాధార‌ణ జీవితాన్ని గ‌డ‌పాల్సిన వాళ్లం. ఈ రోజు ఇక్క‌డ స‌క్సెస్ పుల్ గా ఉన్నామంటే దానికి కార‌ణం మాకు స‌హాయం చేసిన వారితో పాటు ఇండ‌స్ట్రీ స‌హ‌క‌రించ‌డంతోనే ఈస్థాయికి చేరుకున్నాం. అందుకు తమను ఇంతవారిని చేసేందుకు సాయపడిన ప్రతి ఒక్కరికి ఎప్ప‌టికీ ఎంతో రుణ‌ప‌డి ఉంటామని చెప్పుకొచ్చారు.

- Advertisement -

వాటికోసం ఎప్పుడూ ఆశపడలేదు..

ఇక ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు కావాల‌ని అడిగి మ‌రీ మ‌మ్మ‌ల్ని వారి సినిమాల‌కు పెట్టుకుంటారు. అదంతా మా అదృష్టంగానే చెబుతాం. మా ఆహారం.. అలవాట్లు.. మొత్తంగా చెప్పాలంటే మా లైఫ్ చాలా సింపుల్ గా ఉంటుంది. హంగు, ఆర్భాటాలకు తాము అతీతులం అన్నారు. ఎందుకంటే డబ్బు, పేరు ప్రతిష్ఠలు ఎండమావుల వంటివి. మనం ఎంత దూరం పరిగెత్తినా ఇంకాస్త దూరంలో అవి కనిపిస్తూనే ఉంటాయి. అందువలన వాటి గురించి మేము ఏనాడు ఆలోచించం, ఆశపడటం లేదు. మాకు రావలసిన అవకాశం పోయిందని నిరాశపడం కంటే, మా కంటే ఎక్కువ అవసరంలో ఉన్న మరొకరికి ఆ ఛాన్స్ వెళ్లినందుకు హ్యాపీగా ఫీలవుతాం` అని అన్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర లాంటి సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ బిజీగా ఉన్నారు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు