RAM : నార్త్ స్టేట్స్‌లో నెంబర్ వన్ రామ్… తెలుగు హీరోలు ఎవ్వరికీ సాధ్యం కానిది ఇది..

RAM : రామ్ పోతినేని గురించి అందరికీ తెలుసు.. దేవదాస్, గణేష్ లాంటి రొమాంటిక్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత మాస్ హీరోగా మారాడు.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో తన మాస్ రాంపేజ్ ఏంటో చూపించాడు.. ఆ సినిమా తర్వాత మాస్ హీరో ట్యాగ్ ను అందుకున్నాడు.. నెక్స్ట్ వచ్చిన సినిమాలు అన్ని కూడా మాస్ యాక్షన్ సన్నివేశాలతో వచ్చాయని తెలిసిందే.. అయితే ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన సినిమాలన్నీ తెలుగులో బోల్తా కొట్టాయి.. కానీ హిందీలో అదిరిపోయే రికార్డ్ ను సొంతం చేసుకున్నాయి.

తాజాగా రామ్ నటించిన సినిమాలకు హిందీలో, అందులోనూ యూట్యూబ్ లో వందల మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘స్కంధ’ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ 100 మిలియన్స్ పైగా వ్యూస్ ను రాబట్టింది. ఇప్పటివరకు తెలుగులో ఏ హీరో సినిమాకు అంత వ్యూస్ రాలేదని తెలుస్తుంది.. ఒక్క రామ్ నటించిన 10 మూవీస్ మంచి వ్యూస్ ను రాబట్టి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేశాయి..

Ram movies broke the record with million views in Hindi
Ram movies broke the record with million views in Hindi

రామ్ హీరోగా నటించిన ‘ది వారియర్’, హలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజా, పండగ చేస్కో, ఇస్మార్ట్ శంకర్, గణేష్, హైపర్ సినిమాలు యూట్యూబ్ లో 100 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి మరో రికార్డ్ ను అక్కడ బ్రేక్ చేశాయి.. ఈ హీరో నటించిన గణేష్, హైపర్ వంటి సినిమాలు 100 మిలియన్ వ్యూస్ తర్వాత యూట్యూబ్ లో డిలీట్ చేసారు. ప్రస్తుతం రామ్ పోతినేని నటించిన 7 చిత్రాలు యూట్యూబ్ లో 100 కు పైగా మిలియన్ వ్యూస్ రాబట్టాయి.. అయితే తెలుగులో ఈ సినిమాలు అంతగా హిట్ టాక్ అందుకోలేదు.. నార్త్ లో మిలియన్ వ్యూస్ ను రాబట్టడం విశేషం… ఇక రామ్ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఇష్మార్ట్ శంకర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా ఆగష్టు 15 థియేటర్లలోకి రాబోతుంది.. గత కొంతకాలంలో రామ్ కు తెలుగులో సరైన హిట్ పడలేదు.. మరి ఈ సినిమా అన్న హిట్ టాక్ ను అందుకుంటుందేమో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు