Ram pothineni: అది రామ్ కు మాత్రమే సాధ్యమైన రికార్డ్, ఆ తప్పు చేయకపోతే మంచిది

Ram pothineni: ఏ సినిమా ఎవరికి నచ్చుతుందో ఎవరు ఊహించలేరు. ఎంతో నమ్మకంతో తీసిన కొన్ని సినిమాలు తెలుగులో ఫెయిల్ అవుతూ వచ్చాయి. ఏమాత్రం అంచనాల లేకుండా వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రతి సినిమాకి కూడా ఒక రకమైన అంచనా ఉంటుంది ఆ అంచనాలను ఆ సినిమా అందుకోకపోతే దాన్ని డిజాస్టర్ గా తేల్చేస్తారు. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్న యంగ్ హీరోస్ లో రామ్ పోతినేని ఒకరు. తెలుగులో రామ్ కి ఎంత మార్కెట్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో కూడా తన మార్కెట్ ని ప్రూవ్ చేసుకోనున్నాడు.

వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన దేవదాస్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్. మొదటి సినిమాతోనే అద్భుతమైన పేరెంట్ సాధించుకొని తన టాలెంట్ను ప్రూవ్ చేసుకున్నాడు. అలానే డాన్సులు కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ చాలామంది సీనియర్ స్టార్ హీరోలతో పోటీపడి అందుకున్నాడు. ఆ తర్వాత రామ్ చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయ్యాయి. ఇప్పటికీ రామ్ నుంచి ఒక సినిమా వస్తుందేనంటే ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తారు.

Ram Pothineni

- Advertisement -

అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాని రికార్డ్ రామ్ కి సాధ్యమైంది. రామ్ చేసిన 10 సినిమాలు హిందీ డబ్ వెర్షన్ లో 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించాయి. 100 మిలియన్ వ్యూస్ రావడం అనేది మామూలే విషయం కాదు. ఇప్పుడు వస్తున్న చాలా పాన్ ఇండియా మూవీస్ ట్రైలర్ కి టీజర్ కి ఇన్ని వ్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటిది ఒక సినిమాకు 100 మిలియన్ వ్యూస్ రావటం అనేది అరుదుగా జరుగుతుంది. ఇలా రామ్ 10 సినిమాలుకు జరిగింది.

నేను శైలజ
హలో గురు ప్రేమకోసమే
ఇస్మార్ట్ శంకర్
వారియర్
ఉన్నది ఒకటే జిందగీ
పండగ చేసుకో
స్కంద
రెడ్

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ సాయి నటించిన సినిమాల కూడా హిందీలో మంచి వ్యూస్ వస్తాయి. దీనితో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమాను వివి వినాయక్ దర్శకత్వంలో హిందీలో తీశారు. కానీ అక్కడ సినిమా వర్కౌట్ కాలేదు. వీష్ వస్తున్నాయి కదా అని రామ్ కూడా హిందీలో సినిమా చేస్తే ఆ ఆదరణ ఉండకపోవచ్చు అనేది కొంతమంది అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు