Ram Pothineni : ఆ పక్కొడు… ఆ పకోడి గాడు ఎవడు అన్నాయ్… కొంపతీసి మనోడు అయితే కాదుగా..

Ram Pothineni : ఆగస్టున 15 విడుదల కాబోతున్న సినిమాల పై జనాల ఫోకస్ ఎక్కువగా ఉంది. ఆ డేట్ న రిలీజ్ కాబోతున్న సినిమాలలో రవితేజ మిస్టర్ బచ్చన్ , రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమాల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ హీరోలు ఇద్దరు కూడా గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు తమ మూవీని జనాల్లోకి తీసుకెళ్లాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో రామ్ పోతినేని మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ , రామ్ పోతినేని కాంబోలో వస్తున్నా రెండో సినిమా ఇది. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ ను షేక్ చేశాయి. మొన్న వచ్చిన క్యా లఫుడా అనే పాట ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్ కు నిర్మాత ఛార్మి , డైరెక్టర్ పూరి జగన్నాథ్ , రామ్ పోతినేని, కావ్య థాపర్ , అలీ , గెటప్ శ్రీను తదితరులు హాజరై సందడి చేసారు. అందులో హీరో రామ్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆయన మాట్లాడుతూ..

ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ ఒకటి చూస్తున్న అని మొదలు పెట్టాడు. నీకు ఇది నచ్చుతుందా అంటే వాళ్లకు నచ్చుతుందా.. లేక ఎవరికైనా నచ్చుతుందా అని పక్కనోళ్ళ వైపు చూస్తున్నారు. అరే నీకు నచ్చింది నువ్వు చెయ్యి.. వేరేవాళ్లను ఏండుకుగు అడుగుతావ్ .. అది ఏదైనా సరే బిర్యానీ అయినా సరే గుర్తుపెట్టుకో.. నీకు నచ్చితే నచ్చిందని చెప్పు . పక్కనోళ్ళ గురించి మనకెందుకు. ఆ పక్కనోడి .. ఆ పకోడీ గాళ్ళ గురించి మనకెందుకు అని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో దీనిపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

- Advertisement -
Ram Pothineni's speech at the Double Smart pre-release event went viral.
Ram Pothineni’s speech at the Double Smart pre-release event went viral.

ఆ పకోడీ గాడు వీడేనా ..

ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ .. ఆ పక్కోడు .. ఆ పకోడీ గాడు ఎవరు అన్నాయ్ . కొంపదీసి పూరి జగన్నాథ్ కాదుగా.. ఈ మధ్య మీ ఇద్దరికీ చెడిందని వార్తలు వినిపిస్తున్నాయి అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఒకరకంగా రామ్ , పూరీని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ వీడియో పై అటు డైరెక్టర్ పూరి ఫ్యాన్స్ , ఇటు రామ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. మరి దీనిపై రామ్ ఎలా స్పందిస్తారో చూడాలి.. ఆ వీడియో పై ఓ లుక్ వేసుకోండి.. ఈ సినిమాలో రామ్ కు జోడిగా కావ్య థాపర్ నటించింది. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ జనాలను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు