Boxoffice: బ్లాక్ బస్టర్స్ రిలీజైన రోజు వస్తుంది. ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుద్దా?

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఈ సినిమాను టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. ఏజెంట్ నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాల్ని పెంచేసాయి. ఏజెంట్ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో నటించగా, ముంబై బ్యూటీ సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. హిప్-హాప్ తమిజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా, ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, ‘సురేందర్ 2 సినిమా’ బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 28 న రిలీజ్ కాబోతుంది.

అయితే ఏప్రిల్ 28 తేదీ కి టాలీవుడ్ లో ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు పలు బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదలై రికార్డులు సృష్టించాయి. అందులో కొన్ని ఇండస్ట్రీ రికార్డులని తిరగ రాశాయి. ముందుగా 1955 లో ఏన్ఆర్, అంజలీదేవి నటించిన అనార్కలి ఏప్రిల్ 28న విడుదలై భారీ విజయం సాధించింది. ఇక 1977 లో ఎన్టీ రామారావు నటించిన “అడవి రాముడు” సినిమా ఏప్రిల్ 28న విడుదలై ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఆ తర్వాత 1994 లో కమెడియన్ అలీ హీరోగా నటించిన “యమలీల” కూడా ఏప్రిల్ 28 న వచ్చి సంచలన విజయం సాధించింది. ఈ సినిమా విజయం అలీ హీరోగా యాభై సినిమాలకు హీరోగా నటించడానికి దోహదపడింది.

ఇక టాలీవుడ్ లో కొత్త తరం ఆరంభమైన రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన పోకిరి 2006 ఏప్రిల్ 28 న విడుదలైంది. ఈ సినిమా తోనే మహేష్ బాబు టాప్ హీరో అయ్యాడు. ఇక ఈ మధ్యకాలం లోనే వచ్చిన పాన్ ఇండియా చిత్రం బాహుబలి 2 కూడా 2017 ఏప్రిల్ 28 న విడుదలై ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది.

- Advertisement -

ఇప్పుడు ఇదే రోజున టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ గా భారీ అంచనాలతో ఏజెంట్ మూవీ విడుదల కాబోతుంది. ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదలైన రోజున ఏజెంట్ సినిమా కూడా విడుదలవుతుంది. మరి వీటి లాగే ఏజెంట్ సినిమా సక్సెస్ సాధిస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఏప్రిల్ 28 వరకు వేచి చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు