Devara : పాట ఎప్పుడని అడక్కండి.. ఎప్పుడొచ్చినా భీభత్సమే..

Devara : జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ అంచనాలు విపరీతంగా పెంచేస్తుంది. నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్, సినిమాపై అంచనాలని స్కై లెవెల్లో పెంచేసాయి. మధ్యలో పాటలు కాస్త ట్రోల్ అయినా, వింటున్న కొద్దీ చార్ట్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి. ఇక దేవర నుండి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ అయ్యాయన్న విషయం తెలిసిందే. అతి త్వరలో మూడో సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతుండగా, తాజాగా దేవర పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి (RamaJogaiah Sastri) దేవర మూడో సాంగ్ గురించి చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Ramajogaiah Sastry Interesting comments on Devara third song

పాట ఎప్పుడని అడక్కండి, కానీ…

ఇక దేవర (Devara) సినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ కాగా, రెండూ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఫియర్ సాంగ్ మాంచి హై వోల్టేజ్ మాస్ ట్యూన్స్ తో ఫ్యాన్స్ కి గూస్బంప్స్ తెప్పిస్తుండగా, రెండో సాంగ్ చుట్టమల్లే రొమాంటిక్ ట్యూన్స్ తో మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా రచయిత రామజోగయ్య శాస్త్రి మూడో సాంగ్ గురించి చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో నెటిజన్ కి రిప్లై ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి ఇలా చెప్పుకొచ్చాడు. మూడో పాట గురించి కామెంట్ చేస్తూ… మూడో పాట .. పాటకు మించిన ఆట .. కన్నుల పండగ.. ఒక ఆట ఆడుకున్నాడట తారకరాముడు.. ” పాట ఎప్పుడని అడక్కండి .. ఎప్పుడొచ్చినా బీభత్సమే పక్కా” .. ఈ ఆల్బమ్ వేరే లెవెల్ అంతే” అంటూ రామజోగయ్య శాస్త్రి ట్వీట్ వేశారు.

- Advertisement -

 

అంచనాలను మించిపోతుంది..

ఇక రామజోగయ్య శాస్త్రి వేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పక్కా భీభత్సమే అని ఫిక్స్ అయిపోయారు. ఇక దేవర మూడో సాంగ్ “ఆయుధ పూజ” సాంగ్ అయి ఉంటుందని సమాచారం. ఇక ఈ పాట బహుశా వినాయక చవితి రోజున రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. ఇక ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక దేవరను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా, అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసందే. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలతో పాన్ ఇండియా భాషల్లో దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు