Ramajogayya Sastry : తిరుమలలో రామజోగయ్య శాస్త్రి.. రావడానికి కారణం ఇదేనట!

Ramajogayya Sastry : టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో ప్రముఖ చిత్రాల్లో తనదైన శైలి లో పాటలు రాస్తూ సినీ ప్రియుల్ని అలరిస్తున్నారు. ఒకప్పుడు డివోషనల్ సాంగ్స్ కి పరిమితమైన ఈ రచయిత, నేడు మాస్ క్లాస్ అన్న తేడా లేకుండా అన్ని రకాల పాటలు రాస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్ గేయ రచయితల్లో రామజోగయ్య శాస్త్రి కూడా ఒకరు. ఈ ఇయర్ విడుదలైన చాలా పెద్ద సినిమాల్లో కూడా రామ్ జో శాస్త్రి పాటలు రాయగా, లేటెస్ట్ గా ఆయన రాసిన దేవర లో రెండో సాంగ్ చుట్టమల్లే చుట్టేస్తాంది పాట నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఈ పాట యూట్యూబ్ లో ఇప్పటికే 20 మిలియన్ల వ్యూస్ దాటేసి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.

Ramajogayya Sastry visited Tirumala Venkateswara Swamy Temple

తిరుమల దర్శనానికి కారణం ఇదే!

ఇక త్వరలో విడుదల కాబోతున్న విశ్వంభర, రాజాసాబ్ లాంటి బడా ప్రాజెక్ట్స్ కి కూడా రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) పాటలు రాయనున్నారు. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా రామజోగయ్య శాస్త్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎప్పట్లాగే రెగ్యులర్ గా ఆయన తిరుమలకు వెళ్తున్నా ఈసారి రామజోగయ్య శాస్త్రీ ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారట. దీనికి కారణం కూడా ఆయన చెప్పుకొచ్చారు. రామజోగయ్య శాస్త్రి మీడియా తో మాట్లాడుతూ “మా పెద్దబ్బాయి పెళ్లి ఈ నెల జరుగుతుంది.. అందుకే స్వామివారికి మొదటి ఆహ్వాన పత్రిక అందచేద్దామని వచ్చానని రామజోగయ్య శాస్త్రి చెప్పుకొచ్చారు.

- Advertisement -

అలాగే దర్శనానికి బయల్దేరిన వెంటనే దేవర సినిమాలోని రెండో పాట రిలీజ్ అయిందని, మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందని శాస్త్రి చెప్పుకొచ్చారు. ఇక రామజోగయ్య శాస్త్రి కి హర్ష, తేజ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. బహుశా పెద్దబ్బాయి పెళ్లి కావచ్చని సమాచారం. ఇకపోతే రామజోగయ్య శాస్త్రి సినిమాల్లో తనదైన శైలిలో రచయితగా దూసుకుపోతున్నారు. యంగ్ రచయితలకు సైతం పోటీనిస్తూ వరుసగా స్టార్ హీరోల సినిమాలకు పాటలు రాస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు