RamaNaidu: అప్పట్లోనే ఇంతమంది హీరోయిన్స్ వెంటపడ్డారా.. మన్మధుడే ..!

RamaNaidu.. మూవీ మొఘల్… అగ్ర నిర్మాత రామానాయుడు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించారు.. ఆ తర్వాత నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన ఈయన.. స్టూడియో అధినేతగా కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసుకున్నారు. రామానాయుడు కృషి, పట్టుదలకు, నిరంతర శ్రమకి మారుపేరుగా విలువలతో కూడిన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలిచారు. ఏకంగా 13 భారతీయ భాషల్లో 150 కి పైగా సినిమాలు తీసి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు నిర్మించిన నిర్మాతగా 2008లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం దక్కించుకున్నారు.. పది రూపాయల నోటుపై ఉన్న అన్ని భాషల్లో.. చిత్రాలను నిర్మించిన నిర్మాతగా అరుదైన ఘనత అందుకున్న ఈయన.. తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం.. ఇకపోతే నిర్మాతగా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈయన అంటే చాలామంది హీరోయిన్లకు ఇష్టం కూడా.. ఆయనపై ఎంతోమంది హీరోయిన్లు మోజు పడ్డారని.. అప్పట్లో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.. అయితే ఈ విషయాలన్నింటినీ ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం.

RamaNaidu: At that time, so many heroines chased..Manmadhu..!
RamaNaidu: At that time, so many heroines chased..Manmadhu..!

మన్మధుడే. అందుకే అమ్మాయిలంతా వెంటపడేవారు..

స్వతహాగా రామానాయుడు మంచి అందగాడు.. మంచి పొడవు.. హీరోకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా ఈయనలో ఉండేవి.. మరి రామానాయుడు పై ఎవరు మనసు పడలేదా ..అనే డౌట్ చాలా మందికి వచ్చింది.. దీనిపై యాంకర్ ఆయనను ఇదే ప్రశ్న అడగ్గా.. తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు.. ప్రతిరోజు షూటింగ్ స్పాట్ కి వైట్ అండ్ వైట్ లో కారులో దిగే రామానాయుడు వంక ఆడపిల్లలంతా అదోలా చూసే వారట.. అది చూసి శాంత కుమారి.. ఈ ముండలంతా నిన్నే చూస్తున్నార్రా.. హీరోగా యాక్ట్ చెయ్యి అని నన్ను ఆటపట్టించే వారని ఆయన గుర్తు చేసుకున్నారు.. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

వ్యాపారం చేయాలనుకొని.. నిర్మాత గా రికార్డ్…

ఇకపోతే ఏదో ఒక వ్యాపారం చేసుకొని జీవితంలో నిదొక్కుకోవాలనే ఉద్దేశంతో మద్రాస్ లో అడుగుపెట్టిన ఈయన నిర్మాతగా స్థిరపడ్డారు. 1964లో సురేష్ ప్రొడక్షన్స్ ను నెలకొల్పి నటసార్వభౌముడు ఎన్టీఆర్ తో రాముడు భీముడు తెరకెక్కించారు.. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూ.. ముందుకు వెళ్లిన ఈయనకు. ఒక దశలో వరుస ఫ్లాప్ లు ఎదురయ్యాయి.. అయినప్పటికీ కృంగిపోలేదు. ప్రేమనగర్ తీసి ఘన విజయాన్ని సొంతం చేసుకొని అక్కడ్నుంచి వెనుతిరిగి చూసుకోలేదు.. ఇకపోతే తన జీవితానికి రాముడు భీముడు విత్తనం అయితే.. ప్రేమ్ నగర్ చెట్టు అంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు రామానాయుడు.

- Advertisement -

ఎంతో మందికి అండగా..

ముఖ్యంగా తన సినిమాల ద్వారా ఎంతో మంది హీరో, హీరోయిన్ లు, టెక్నీషియన్లు, దర్శకులను, క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఈయన సొంతం.. ఇంత వాడిగా.. తనను చేసిన సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో వృద్ధాశ్రమంతో పాటు సేవా కార్యక్రమాలకు సినీ కార్మికుల సంక్షేమానికి పలు రకాల విరాళాలు కూడా ఇచ్చారు.. అంతేకాదు తెలుగుదేశం పార్టీ టికెట్ పై బాపట్ల ఎంపీగా గెలిచి ఆ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు.. అలాగే సినీ రంగానికి చేసిన సేవలు గానూ.. 2009లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2012లో పద్మభూషణ్ అవార్డులు లభించాయి.. అలాగే ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో పాటు రఘుపతి వెంకయ్య అవార్డు కూడా ఈయన అందుకున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు