Adipurush: రావణుడి పాత్రను అలా నాకు చూపడం నచ్చలేదు!

Ramayan Sita Dipika Chikhlia Takes Exception On Adipurush Ravan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ఇతడిని అందరూ ప్రభాస్ అని పిలుచుకుంటారు. ప్రభాస్ తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే.

బాహుబలి సినిమా అనంతరం ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రభాస్ నటించిన తాజా చిత్రం “ఆది పురుష్”. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, సీతాదేవి పాత్రలో కృతి సనన్ నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను 3డి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కించారు. రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాలతో గతేడాది జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి రోజునే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. డైరెక్టర్ ఓం రౌత్ రామాయణాన్ని తెరకెక్కించిన విధానంపై ప్రతి ఒక్కరు నెగటివ్ గా మాట్లాడారు.

డైరెక్టర్ ని ఉద్దేశించి దారుణంగా ట్రోల్ కూడా చేశారు. ఈ సినిమా గురించి తాజాగా రామాయణ్ సీరియల్ లో సీతగా నటించిన దీపికా చిక్లియా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. ఈ చిత్రంలోని పాత్రలపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆది పురుష్ సినిమా చూసిన ప్రతి ఒక్క పిల్లలు రామాయణం అంటే ఇలానే ఉంటుందేమో అని అనుకుంటారు. అది భవిష్యత్తులో అందరికీ ప్రమాదకరం. ఆ విషయం తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. ఈ సినిమాలో చూపించినట్టుగా రావణుడు ఉండడని వాళ్లకు ఎవరు చెప్పడం లేదు.

- Advertisement -

Adipurush: ఇతిహాసాల జోలికిపోకుండా ఉంటే మంచిది! | Deepika Chikhalia Again  fire on Adipurush Charectors avm

దీంతో రామాయణంలో రాముడు, సీత కూడా ఇలానే ఉంటారని వారు అనుకుంటారు. రావణుడు గొప్ప శివభక్తుడు. ఆయనలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అతను తన జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు సీతను అపహరించడం. తన జీవితంలో ఆ ఒక్కటి కనుక చేయకపోతే అతను చాలా గొప్ప వ్యక్తి. మంచి పండితుడిలా ఉండేవారు. అంత గొప్ప వ్యక్తిని ఆది పురుష్ లో రోడ్ సైడ్ ఉండే రౌడీలా చూపించడం నన్ను చాలా బాధపెట్టింది అని దీపిక కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు