GameChanger : నెట్టింట వైరల్ అవుతున్న గేమ్ ఛేంజర్ న్యూస్.. ఆరోజున స్పెషల్ కంటెంట్ రిలీజ్..

GameChanger : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ దాదాపు ముగిసిపోయిందని చిత్ర యూనిట్ పలుమార్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు శంకర్ గాని, దిల్ రాజు గాని రామ్ చరణ్ కి సంబంధించిన షూట్ మొత్తం ఫినిష్ అయిందని, మిగతా చిన్న చిన్న టాకీ పార్ట్ ఓ పది రోజులు మాత్రమే బాకీ ఉందని చెప్పుకొచ్చారు. ఇక దిల్ రాజు గేమ్ ఛేంజర్ ని క్రిస్మస్ కి తీసుకు వస్తాం అని ఇప్పటికే అరడజను సార్లు చెప్పుకొచ్చాడు. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఒక్క ప్రమోషన్ స్టంట్ కూడా చేయడం లేదు. క్రిస్మస్ రిలీజ్ అంటే మూడు నెలలే సమయం ఉంది. కానీ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్, ఒక సాంగ్ మినహా, మరో అప్డేట్ రాలేదు. దీంతో చరణ్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ (GameChanger) గురించి నెట్టింట ఓ గాసిప్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

RamCharan GameChanger Movie latest update

గేమ్ ఛేంజర్ నుండి ఆరోజున స్పెషల్ కంటెంట్ రిలీజ్..

ఇక రామ్ చరణ్ (Ram charan) కి సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయిపోగా, సినిమా నుండి ఒక సాంగ్ మాత్రమే వచ్చింది. అది కూడా వచ్చి నాలుగు నెలలు అయిపొయింది. మళ్ళీ ఒక్క న్యూస్ రాలేదు. అయితే తాజాగా నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ తెగ వైరల్ అవుతుంది. గేమ్ ఛేంజర్ నుండి ఓ స్పెషల్ కంటెంట్ ని వినాయక చవితి స్పెషల్ డే నాడు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే అది ఏంటా అన్న విషయం మాత్రం సస్పెన్స్ గా ఉంచారట. అయితే నెట్టింట అది రెండో సాంగ్ అయి ఉండొచ్చు, లేదా టీజర్ అప్డేట్ అయి ఉండొచ్చు అని చర్చ నడుస్తుంది. రెండింట్లో ఏది వచ్చినా ఫ్యాన్స్ హ్యాపీనే. లేదా సింపుల్ గా రిలీజ్ డేట్ పై కన్ఫర్మేషన్ ఇస్తూ పోస్టర్ రిలీజ్ చేయొచ్చు.

- Advertisement -

ప్రమోషన్లు మొదలు పెట్టాల్సిందే..

ఇక గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కోసం చరణ్ అభిమానులు రెండేళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక దిల్ రాజు (Dil raju) మాత్రం క్రిస్మస్ కు గేమ్ ఛేంజర్ ని విడుదల చేస్తానని అంటున్నా ఓ వైపు డౌట్ గానే ఉంది. అయితే గేమ్ ఛేంజర్ కి లాంగ్ రన్ అవసరం కాబట్టి, నవంబర్ కి తీసుకువస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ నుండి అప్డేట్ వచ్చి కొన్ని నెలలు అయింది కాబట్టి, ఇప్పటి నుండే ఓ సాంగ్ లేదా, టీజర్ రిలీజ్ చేసి వెంటనే ప్రమోషన్లు మొదలు పెట్టాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్ర, సునీల్, ఎస్.జె. సూర్య శ్రీకాంత్, రాజీవ్ కనకాల, సముద్రఖని వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఇక థమన్ ఈ సినిమా కోసం ఏకంగా ఏడు అద్భుతమైన పాటలు రెడీ చేస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు