Ramcharan : ఆ గుర్రాన్ని నేను రాజమౌళి గారిని అడిగాను

Ramcharan : చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. రామ్ చరణ్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని చిరు తనయుడు అనిపించుకున్నాడు. తన యాక్టింగ్ తోను డాన్స్ పర్ఫామెన్స్ తోను మెగా ఫ్యాన్స్ కి ఒక హోప్ ఇచ్చాడు. ఇకపోతే చరణ్ నటించిన రెండో సినిమా మగధీర ఈ సినిమా సృష్టించిన రికార్డ్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా అప్పట్లో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది.

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చాలామంది ఆడియన్స్ ను సప్రైజ్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నిటిని అద్భుతంగా వాడి ఆ సినిమాని హిట్ దిశగా మలిచాడు రాజమౌళి. అక్కడితో చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మగధీర తర్వాత చేసిన ఆరెంజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అప్పటికే ఆరెంజ్ సినిమా పాటలు అద్భుతంగా హిట్ అవడంతో ఈ సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కానీ అంచనాలను ఆరెంజ్ సినిమా అందుకోలేకపోయింది.

ఇక మగధీర సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని మొదట హీరో సూర్య చేయాల్సి ఉంది అని రామ్ చరణ్ తేజ్ ఒక ఈవెంట్లో చెబుతూ వచ్చాడు. మొత్తానికి ఆ ప్రాజెక్టు మిస్ అయి రామ్ చరణ్ చేతికి వచ్చింది. ఏదేమైనా రాంచరణ్ తేజ్ మగధీర సినిమాకి కంప్లీట్ గా న్యాయం చేశాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ చేసిన హార్స్ రైడింగ్ ఎపిసోడ్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. చిన్నప్పుడు నుంచి హార్స్ రైడింగ్ అంటే రామ్ చరణ్ కి చాలా ఇష్టం. చాలాసార్లు పవన్ కళ్యాణ్ కూడా హార్స్ రైడింగ్ కి రాంచరణ్ ను తీసుకెళ్తూ ఉండేవాడు.

- Advertisement -

Ram Charan Teja

ఇక మగధీర సినిమాలో రామ్ చరణ్ బాద్షా అనే ఒక గుర్రాన్ని ఉపయోగించాడు. అయితే షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆ గుర్రాన్ని కావాలని రామ్ చరణ్ తేజ్ అడిగాడంట. ఆ గుర్రాన్ని తీసుకున్న రామ్ చరణ్ తేజ్ తన వద్ద ఉంచుకొని పెంచాడు. ఇప్పుడు ఆ గుర్రానికి ఒక బేబీ కూడా పుట్టింది. ఆ బేబీ పై క్లింకార ఆడుకుంటుంది అంటూ రీసెంట్ గా ఒక వేదికపై రామ్ చరణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు