RamCharan : వైరల్ అవుతున్న గ్లోబల్ స్టార్ ఛేంజోవర్.. బుచ్చి కోసం మామూలు ప్లానింగ్ కాదు!

RamCharan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ తరవాత రెండు భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తీయబోయే సినిమా కాగా, మరొకటి క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తీయబోయే సినిమా. అయితే ఈ సినిమాలు పట్టాలెక్కలంటే ముందు గేమ్ ఛేంజర్ సినిమా ఫినిష్ చేయాలి. కానీ మూడేళ్ళ కింద మొదలైన ఈ సినిమా ఇప్పటివరకూ పూర్తి కాకపోవడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం శంకర్ ఇండియన్2 నే అని అందరికి తెలిసిందే. ఆగిపోయిన ఈ సినిమా మళ్ళీ మొదలై, ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయింది. జులై 12న థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతుంది. అయితే గేమ్ ఛేంజర్ సినిమా రీసెంట్ గా రాజమండ్రిలో రామ్ చరణ్ తో ఫైనల్ షెడ్యూల్ పూర్తి చేసాడు శంకర్. దాంతో చరణ్ కి సంబంధించిన షూట్ మొత్తం పూర్తయిందట. మిగతా పార్ట్ ఓ వారం పది రోజులు ఇతర కాస్ట్ తో షూట్ చేయాల్సిన చిన్న సీన్లు మాత్రమే ఉన్నాయట. అందుకే రామ్ చరణ్ ఇప్పుడు తదుపరి సినిమాను మొదలుపెట్టే ప్లాన్ లో ఉన్నాడు.

RamCharan latest look viral on social media for RC16 movie

వైరల్ అవుతున్న చరణ్ కొత్త లుక్!

ఇదిలా ఉండగా రామ్ చరణ్ లేటెస్ట్ గా ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు. తాజాగా తిరిగి వస్తుండగా, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. అయితే ఎయిర్ పోర్ట్ లో కనిపించిన రామ్ చరణ్ లుక్స్ లో చాలా ఛేంజోవర్ కనిపిస్తుంది. చూడ్డానికి గేమ్ ఛేంజర్ లుక్స్ లా అనిపించినా దగ్గరి నుండి కనిపిస్తే షార్ట్ గా గడ్డం పెంచినట్టు, బాడీ మేకోవర్ పై కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఫిట్ గా కాకుండా కాస్త లావుగా అయినట్టు కనిపిస్తుంది. ఓవరాల్ గా కొంచెం మాసీ గానే ఉన్నాడు చరణ్. ఇక ఈ లుక్ చూసి బుచ్చిబాబు సినిమా కోసమే కొత్త లుక్ పై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇక రామ్ చరణ్ ఒక సినిమాపై ఫోకస్ పెట్టాడంటే ఎంత డెడికేషన్ తో ఉంటాడో చెప్పనక్కర్లేదు. రంగస్థలం, RRR, అప్పట్లో ధ్రువ లాంటి సినిమాలకు రామ్ చరణ్ లుక్స్ పరంగా ఎంత వేరియషన్స్ చూపించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు బుచ్చిబాబు సినిమా కోసం అంతకు మించి కష్టపడుతున్నాడట చరణ్.

- Advertisement -

బుచ్చితో స్టార్ట్ ఎప్పుడంటే?

ఇక రామ్ చరణ్ (RamCharan) ఇప్పడు గేమ్ ఛేంజర్ కి సంబంధించి తన పార్ట్ మొత్తం పూర్తి చేసాడట. మహా అయితే ఒకటి రెండు రోజులు చిన్న బిట్స్ ఏమైనా షూట్ చేయొచ్చు. ఆ తర్వాత ప్రమోషన్స్ కి అటెండ్ అవడం తప్ప పెద్దగా పని ఉండదు. సో.. ఇప్పుడు బుచ్చిబాబు సినిమాపైనే మొత్తం ఫోకస్.. ఇక బుచ్చిబాబు తో సినిమా షూటింగ్ జులై చివరి వారంలో మొదలవుతుందని సమాచారం. ఆల్రెడీ బుచ్చిబాబు సినిమాకి సంబంధించి భారీ సెట్టింగ్స్ కూడా వేయించాడు. ఇక ఈ సినిమా పీరియాడిక్ కథాంశంతో, స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విలేజ్ డ్రామా అని తెలిసిందే. కొంత మంది ఇది కోడి రామమూర్తి బయోపిక్ అని అంటున్నా, అది చిత్ర యూనిట్ నుండి క్లారిటీ వస్తే గాని చెప్పలేం. మరి బుచ్చిబాబుతో RC16 ఎప్పుడు ప్రారంభిస్తారో అని చరణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు