Ramcharan: గ్లోబల్ స్టార్ పై నిహారిక షాకింగ్ కామెంట్స్.. చీటర్ అంటూ..!

Ramcharan.. మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం తాను నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారుతోంది. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నిహారిక కు సంబంధించిన కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో నిహారిక తన అన్నయ్య , ప్రస్తుత గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.

Ramcharan: Niharika's shocking comments on global star.. calling her a cheater..!
Ramcharan: Niharika’s shocking comments on global star.. calling her a cheater..!

రామ్ చరణ్ ఒక చీటర్..

నిహారిక మాట్లాడుతూ.. నేను రీసెంట్ గా ఒక కొత్త ఇంటికి మారాను. అయితే ఆ ఇంటికి నన్ను కలవడానికి మా కజిన్స్ అంతా వచ్చారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్ , వైష్ణవ్ తేజ్ ఇలా అందరం కలుసుకున్నాం. ఆరోజు రెండు గంటల పాటు సినిమాల టెన్షన్ మర్చిపోయి బాగా ఎంజాయ్ చేశాము. అందరం కలిసి గేమ్ కూడా ఆడాము. అయితే చరణ్ అన్న గేమ్ ఆడతాడు అని చెప్పితే ఎవరు నమ్మరు. కానీ చరణ్ అన్న అన్ని గేమ్స్ కూడా ఆడతారు. అందరితో కూడా చాలా సరదాగా గడుపుతారు. కానీ అన్నయ్య చాలా పెద్ద చీటర్. చాలా చీటింగ్ చేస్తారు. గేమ్స్ లో చీటింగ్ చేసి అందరినీ ఓడించి మోసం చేసి ఆయన మాత్రమే గెలుస్తారు అంటూ చెప్పుకొచ్చింది నిహారిక. ఒక గ్లోబల్ స్టార్ పై చీటర్ అంటూ కామెంట్లు చేయడంతో ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ విషయం తెలిసిన తర్వాత గ్లోబల్ స్టార్ అభిమానులు పలు రకాలుగా రియాక్ట్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు.

నిహారిక కెరియర్..

ఇక నిహారిక విషయానికి వస్తే ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ. ఇక అందులో భాగంగానే కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ , శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. దాదాపు 11 మంది హీరోలు, ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొత్తవారు కావడం విశేషం. కొత్త వారితో సినిమా సక్సెస్ కొట్టాలని భావిస్తోంది నిహారిక. మరి నిహారిక కష్టానికి ఫలితం ఏ విధంగా ఉంటుందో చూడాలి.

- Advertisement -

రామ్ చరణ్ సినిమాలు..

రామ్ చరణ్ విషయానికి వస్తే, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే మరో యంగ్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఇక బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఎంపికైన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు