Ramgopal Varma: పుష్ప రాజ్ గా మారిన రాంగోపాల్ వర్మ.. వీడియో వైరల్..!

Ramgopal Varma: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు తెలిసో తెలియకో చేసిన పనుల వల్ల ట్రోలర్స్ కి చిక్కుతూ ఉంటారు.. అయితే ఇక్కడ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ప్రత్యేకమే.. కాబట్టి ఈసారి కూడా ట్రోలర్స్ కి చిక్కకుండా తనను తాను సెల్ఫ్ ట్రోల్ చేసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ సెల్ఫ్ ట్రోల్ ఏంటి అని ఆలోచిస్తున్నారా..? మరి వర్మ అసలు ఏం చేశారు అనే విషయం ఇప్పుడు చూద్దాం..

వర్మ కెరియర్..

టాలీవుడ్ లో విభిన్నమైన డైరెక్టర్ గా పేరు పొందిన రాంగోపాల్ వర్మ గురించి చెప్పాల్సిన పనిలేదు.. గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను తెలుగు ఇండస్ట్రీకి అందించారు.. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలతో ఎన్నో చిత్రాలు తెరకెక్కించిన వర్మ.. తన సినిమాల ద్వారా ఎంతో మందిని స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా తీర్చిదిద్దడమే కాదు తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన వారిని కూడా నేడు స్టార్ డైరెక్టర్లుగా మార్చిన ఘనత ఈయనకే సొంతం..అయితే ఈ మధ్యకాలంలో వర్మ నుంచి చాలా అశ్లీలతతో కూడి సినిమాలతో పాటు పొలిటికల్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో వర్మని చాలామంది ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఏకంగా ఒక డాన్స్ వీడియో తో తనని తాను ట్రోల్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. వాటి గురించి చూద్దాం.

పుష్ప 2 హుక్ స్టెప్..

Ramgopal Varma: Ramgopal Varma who became Pushpa Raj.. Video viral..!
Ramgopal Varma: Ramgopal Varma who became Pushpa Raj.. Video viral..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.. సుకుమార్ కూడా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. అలాగే సినిమా అభ్యర్థులను కూడా తెలియజేస్తూ చిత్ర బృందం బిజీగా గడిపేస్తుంది. గడచిన కొద్ది రోజుల క్రితం పుష్ప-2 నుంచి టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు. ఇందులో పుష్ప హుక్ స్టెప్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సెలబ్రిటీలే కాకుండా.. క్రికెట్ ఆటగాళ్లు , అభిమానులు, నెటిజన్స్ సైతం ఈ స్టెప్ వేస్తూ .. రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వదులుతున్నారు.

- Advertisement -

సెల్ఫ్ ట్రోల్ చేసుకుంటున్న వర్మ..

ఇప్పుడు తాజాగా రాంగోపాల్ వర్మ.. తన ట్విట్టర్ ఖాతాలో.. పుష్ప -2 లో ఒక బిట్ .. పుష్ప పుష్ప.. పుష్పరాజ్.. అనే లైన్ కి తనదైన స్టైల్ లో డాన్స్ వేస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ నిజమైన వర్మ కాదు యానిమేషన్ వర్మ.. పుష్పరాజు అంటూ వర్మ చేసిన డాన్స్ ను చూసి అందరూ నవ్వు కుంటున్నారు. హిలేరియస్ కామెడీ అంటూ కామెంట్లో కూడా చేస్తున్నారు. ఇక అందుకే ఇంకొకరు ట్రోల్ చేయకుండా ఈ వ్యక్తి ఎవరో గెస్ చేయండి అంటూ ఒక ట్వీట్ కూడా చేయడం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. మొత్తానికైతే వర్మ చేసుకున్న ఈ సెల్ఫ్ ట్రోల్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది ప్రస్తుతం ఈ ట్వీట్ కు పలువురు నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక వర్మ ఏం చేసినా కొత్తగా ఉంటుందంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు