Ram Gopal Varma : చిరంజీవి సినిమాలు ఇష్టం లేదు

గరికపాటి నరసింహారావు ను టార్గెట్ చేస్తూ టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెండు, మూడు రోజుల నుంచి వ‌రుస‌ ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద.. సంఘటనను తెరపైకి తీసుకువచ్చే రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు గరికపాటి నరసింహారావు వెంట పడుతున్నారు. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ నిర్వ‌హించిన అలయ్‌-బ‌ల‌య్ కార్య‌క్ర‌మానికి గరికపాటి నరసింహారావు, మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌య్యారు.

అయితే గరికపాటి నరసింహారావు మాట్లాడాల్సిన‌ సమయంలో అందరూ చిరంజీవితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే, ఈ సంఘటనను చూసి చిరంజీవిపై సెటైర్లు పేల్చుతూ.. గరికపాటి నరసింహారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి గరికపాటికి క్షమాపణలు చెప్పడంతో, అక్కడితో ఈ వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. కానీ దీనిపై నాగబాబు వేలు పెట్టడంతో, మీడియాకు మంచి మసాలా వార్త దొరికినట్టు అయింది. ఈ వివాదం స‌ద్దుమ‌నిగింద‌నే లోపే ఇక తానేమి తగ్గేదే లేదంటూ రాంగోపాల్ వర్మ కూడా ఎంటర్ అయి గరికపాటి నరసింహారావును ఓ ఆట ఆడుకున్నారు.

గరికపాటి అంటే తనకి ఎవరో తెలియదన్నట్టు ట్వీట్లు చేస్తూ, వర్మ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఇక ఈ సంగతి ఇలా ఉంటే, తాజాగా మరోసారి రాంగోపాల్ వర్మ తెరపైకి వచ్చారు. మీడియా సమావేశం నిర్వహించిన వర్మ మెగాస్టార్ చిరంజీవి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా చూశారా అని ఓ విలేఖరి రాంగోపాల్ వర్మను అడిగాడు. అయితే దీనికి తన స్టైల్ లో ఆర్జీవి బదులిచ్చారు. చిరంజీవి అంటే ఇష్టం కానీ, ఆయన సినిమాలంటే నాకు ఇష్టం లేదంటూ బాంబు పేల్చారు. ఆయన సినిమాలు చూడను.. అని కుండ బద్దలు కొట్టి చెప్పారు వర్మ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీనిని చూసిన మెగా ఫ్యాన్స్ వర్మపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు