Ramoji Rao : ఇండస్ట్రీ లో రామోజీరావు తీరని కోరిక..?

Ramoji Rao : దేశ దిగ్గజ ప్రముఖుల్లో ఒకరైన వ్యక్తి, ఈనాడు మీడియా చైర్మన్, ఉషా కిరణ్ మూవీస్ అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ ఫౌండర్ రామోజీ రావు ఈరోజున (శనివారం) ఉదయం (88) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌ లో జాయిన్ చేశారు. అప్పుడే ఆయన ఆరోగ్యం క్షీణించగా, డాక్టర్లు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ కొన్ని గంటలు గడిస్తే గాని ఏమి చెప్పలేమని అన్నారు. కానీ నేటి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో మీడియా, సినీలోకం, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఇక టాలీవుడ్‌లో ‘ఉషా కిరణ్ మూవీస్’ ద్వారా రామోజీ రావు ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టులను, టెక్నీషియన్లను పరిచయం చేశారు. ఈ ఉషా కిరణాలు.. అంటూ సినిమా ప్రారంభానికి ముందు వచ్చే ఆ గీతాన్ని వినని తెలుగు వారెవ్వరూ ఉండరు. అలా ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, దర్శకులు పరిచయం అయ్యారు.

Ramoji Rao, chairman of 'Enadu' organizations, passed away

ఎన్నో సినిమాలు.. ఎందరో పరిచయం..

ఇక రామోజీరావు (Ramoji Rao) స్థాపించిన ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణ సంస్థ ద్వారా ఎందరో సినీ ప్రముఖులను పరిచయం చేసారు. నేటి తరానికి తెలిసిన ప్రముఖ దర్శకుడు తేజ మొదటి సినిమా ‘చిత్రం’ ఉష కిరణ్ మూవీస్ బ్యానర్‌ లోనే వచ్చింది. ఆ మూవీతోనే ఉదయ్ కిరణ్ వంటి వారు వచ్చారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పరిచయం అయింది కూడా రామోజీరావు నిర్మాణ సారథ్యంలోనే. అలాగే కళ్యాణ్ రామ్ కూడా ఉష కిరణ్ మూవీస్ నుండే పరిచయం అయ్యాడు. ఇలా ఎంతో మంది హీరోలు, హీరోయిన్లను, టెక్నీషియన్లను ఈ ఉషా కిరణ్ బ్యానర్ ఇచ్చింది. ఇక ఈ బ్యానర్ లో మయూరి, ప్రతిఘటన, అశ్విని, పీపుల్స్ ఎన్కౌంటర్, నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.

- Advertisement -

రామోజీరావు తీరని సినీ కోరిక..

అయితే రామోజీ రావు (Ramoji Rao) ఈ బ్యానర్‌లో వంద సినిమాలు తీయాలని రామోజీ రావు అనుకుంటూ ఉండేవారట. ఇప్పటికీ ఆయన ఈ బ్యానర్ లో 90 నుండి 95 సినిమాలు వరకు తీయడం జరిగింది. గత కొన్నాళ్లుగా ఆయన ఆరోగ్య పరిస్థితి వల్ల, అలాగే ఇతర వ్యాపార రంగాల్లో బిజీగా ఉండడం వల్ల, సినిమా నిర్మాణ రంగం పై కొన్నాళ్ళుగా దృష్టి పట్టలేదు. అందువల్ల వంద సినిమాలు తీయడం అనేది తీరిన కోరికగానే మిగిలిపోయింది. ఇక రామోజీ రావు తన బ్యానర్లో వంద సినిమాలు తీయలేకపోయినా.. రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని వేల సినిమాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. భారతీయ భాషల్లో తెరకెక్కే చిన్నా, పెద్దా సినిమాలే కాదు, ఏకంగా హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ తెరకెక్కడం విశేషం. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ వరల్డ్ ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. దేశంలోనే అతి పెద్ద ఫిల్మ్ ప్రొడక్షన్ ప్లేస్‌ గా రామోజీ ఫిల్మ్ సిటీకి ఉన్న పేరు గురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ అన్న తేడా లేకుండా అందరూ రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి షూట్ చేసుకుని వెళ్తుంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు