Ramoji Rao : రామోజీ రావు ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?

Ramoji Rao : విజనరీ మీడియా దిగ్గజం, రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీ రావు తాజాగా కన్నుమూశారు. వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మరణించారు. మృతదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. ఇక ఇప్పటికే రామోజీ రావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన జీవితం గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. ఒక వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన రామోజీ రావు మొదటి జాబ్ ఏంటో తెలుసా?

రామోజీ రావు అసలు పేరు

రామోజీ రావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో వ్యవసాయ కుటుంబంలో 1936 నవంబర్ 16న జన్మించారు. రామోజీ రావు తాత మరణించిన 13 రోజులకు ఆయన జన్మించడంతో తల్లిదండ్రులు ఆయన జ్ఞాపకార్థం రామయ్య అని పేరు పెట్టారు. కానీ రామయ్య అనే పేరు నచ్చలేదని తర్వాత స్కూల్లో చదువుతున్నప్పుడు “రామోజీ రావు” అనే పేరును పెట్టుకున్నారు ఆయన.

రామోజీ రావు మొదటి వ్యాపారం

రామోజీరావుకు 87 ఏళ్లు. వ్యాపార దిగ్గజంగా ఆయనకు మంచి పేరుంది. సీనియర్ నిర్మాత, రామోజీ రావు ఈటీవీ మీడియాను ప్రారంభించడమే కాకుండా అనేక వెంచర్లలో పని చేశారు. అయితే ఆయన మొదటి జాబ్ మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఆయన చేసింది జాబ్ కాదు వ్యాపారం. ఆ వ్యాపారం ఏంటంటే మార్గదర్శి చిట్ ఫండ్. ఇటీవల కాలంలో ఎన్నో వివాదాల్లో నిలిచిన ఈ చిట్ ఫండ్ సంస్థే.

- Advertisement -

Ramoji Rao: Media Mogul Ramoji Rao Passes Away at 87

రామోజీ రావు 1962 అక్టోబర్ లో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్ ఫండ్‌ను ప్రారంభించారు. హిమాయత్ నగర్ రోడ్డులోని ఒక చిన్న అద్దె గదిలో దీన్ని స్టార్ట్ చేశారు. నేడు ఇదొక దిగ్గజ చిట్ ఫండ్ సంస్థ. అంతేకాదు ఇదే అతని జీవితంలో మొదటి వ్యాపారం.  1965లో కిరణ్ యాడ్స్ అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ప్రారంభించాడు. 1967-1969 మధ్య ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడు. వ్యవసాయ సమాచారం అందించేందుకు 1969లో రామోజీరావు ‘అన్నదాత’ పత్రికను ప్రారంభించారు. 1970లో సినిమాల కోసం అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ప్రారంభించాడు. ఈ సంస్థ బాధ్యతలను ఆయన భార్య రమాదేవి చూసుకునే వారు.

విభిన్న వ్యాపార సంస్థలు

రామోజీ రావు రామోజీ గ్రూప్‌ పేరుతో ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీతో సహా అనేక రకాల సంస్థలన మేనేజ్ చేస్తున్నారు. అతని మీడియా సామ్రాజ్యంలో ప్రముఖ ఈనాడు వార్తాపత్రిక, టెలివిజన్ ఛానెల్‌ ETV నెట్‌వర్క్, చిత్ర నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ కూడా ఉన్నాయి.
మీడియాకు అతీతంగా రామోజీ రావు వ్యాపార అభిరుచులు వివిధ రంగాలలో తనదైన శైలిలో దూసుకెళ్లారు.

రామోజీ గ్రూప్ ఆధ్వర్యంలో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు మ్యాగజైన్, ఈటీవీ, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి షోరూమ్‌, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి లక్షలాది మందికి ఉపాధి కల్పించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు