Ramoji Rao: రామోజీరావు పరిచయం చేసిన స్టార్ హీరోలు వీళ్లే.!

Ramoji Rao.. అక్షర యోధుడు రామోజీరావు అస్తమించారు.. ఆయన లేరన్న విషయాన్ని ఇప్పటికీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.. జూన్ 5వ తేదీన శ్వాసకోశ సంబంధిత సమస్యతో హాస్పిటల్ లో చేరిన ఈయన వెంటిలేటర్ పైన చికిత్స తీసుకుంటుండగా.. అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజామున తుది శ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇకపోతే రామోజీరావు మరణించడంతో తెలుగుజాతి మూగబోయిందనే చెప్పాలి.. ఈనాడు దినపత్రిక ద్వారా తెలుగు జాతిని నలు దిశలా వ్యాపింప చేశారు… అంతే కాదు ఈయన ద్వారా ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం పొందిన వారు చాలామంది ఉన్నారు. ఇక ఈరోజు ఈయన మరణించిన తర్వాత ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై పలువురు స్టార్ హీరోలను కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే..మరి ఎవరెవరు రామోజీరావు ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారో ఇప్పుడు చూద్దాం

Ramoji Rao: These are the star heroes introduced by Ramoji Rao.
Ramoji Rao: These are the star heroes introduced by Ramoji Rao.

జూనియర్ ఎన్టీఆర్..

నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఉష కిరణ్ మూవీస్ బ్యానర్ పై నిన్ను చూడాలని సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు రామోజీరావు మరణించడంతో ఇదే విషయాన్ని నందమూరి తారక్ గుర్తు చేసుకున్నారు. రామోజీరావు స్థాపించిన ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో వచ్చిన నిన్ను చూడాలని అనే సినిమా ద్వారానే నేను ఇండస్ట్రీకి పరిచయమయ్యాను… ఆనాటి రోజులు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి.. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఒక గొప్ప నిర్మాత ఈరోజు స్వర్గస్తులవడం చాలా విచారకరంగా ఉంది అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఆ సినిమాతోనే నిర్మాతగా తొలి అడుగులు..

ఇక అలాగే 1984లో జంద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీవారి ప్రేమలేఖ అనే సూపర్ హిట్ చిత్రంతో రామోజీరావు నిర్మాతగా కెరియర్ ను మొదలుపెట్టారు. ఇందులో నరేష్ , పూర్ణిమ జంటగా నటించగా.. ఇప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది .. ఆ తర్వాత ప్రతిఘటన , మయూరి లాంటి చిత్రాలను కూడా రామోజీరావు నిర్మించారు..

- Advertisement -

ఉదయ్ కిరణ్ ని పరిచయం చేస్తూ..

ఇక 2000 సంవత్సర కాలంలో నిర్మాతగా ఆయన జోరు మరింత పెంచారు.. కొందరు స్టార్ హీరోలని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా ఈయనకే దక్కుతుంది.. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలే కాదు అద్భుతమైన ప్రేమ కథ చిత్రాలను కూడా రామోజీరావు నిర్మించడం జరిగింది.. ఇక నూతన దర్శకుడు తేజ, నూతన హీరో ఉదయ్ కిరణ్ లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. ఆయన నిర్మించిన చిత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే.

హీరోలే కాదు హీరోయిన్ లను కూడా..

ఇక ఒక హీరోలనే కాదు హీరోయిన్లని కూడా రామోజీరావు ఇండస్ట్రీకి పరిచయం చేశారు రీమాసేన్, రిచాపల్లోడు, స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ లాంటి హీరోయిన్ అంతా కూడా రామోజీరావు నిర్మాణంలోనే హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు..

సినిమా రంగంలోనే కాదు బిజినెస్ రంగంలో కూడా సక్సెస్..

ఒక్కటేమిటి చాలామందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఒక్క రామోజీరావుకి దక్కుతుందని చెప్పవచ్చు.. మార్గదర్శి, రామోజీ ఫిలిం సిటీ, కళాంజలి, ప్రియా ఫుడ్స్, ఈనాడు దినపత్రిక ఇలా ఒక్కటేమిటి అనేక రంగాలలో అభివృద్ధి కనపరిచి తన మల్టీ టాలెంట్ నిరూపించుకున్నారు రామోజీరావు. ఇక నేడు ఇంతటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం తెలిసి అటు సినీ సెలబ్రిటీలు , రాజకీయవేత్తలు, అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీరితోపాటు హీరో తనీష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నచ్చావులే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు, కళ్యాణ్ రామ్, తరుణ్ , రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, వినోద్ కుమార్ తదితరులు రామోజీరావు ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు