Ramya: అసభ్యకరమైన మెసేజ్లతో చాలా ఇబ్బంది పడ్డా .. కానీ..!

Ramya.. కన్నడ సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు దర్శన్ హీరోగా కంటే ఇప్పుడు హంతకుడి గానే బాగా పేరు సొంతం చేసుకున్నాడని చెప్పవచ్చు. ప్రియురాలి కోసం భార్యకే విడాకులు ఇచ్చిన దర్శన్ ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకొని.. ఇప్పుడు ఆమెను ఎవరో ఒక అభిమాని ఏదో అన్నారని.. ఏకంగా వారిని హతమార్చి హంతకుడిగా మారి జైలు పాలయ్యారు దర్శన్. అసలు విషయంలోకెళితే దర్శన్ తన తో రిలేషన్ లో ఉంటున్న పవిత్ర గౌడ కి అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తున్నాడని రేణుక స్వామి అనే వ్యక్తిని దారుణంగా హత్య చేయించాడు.. హత్య చేసిన నిందితులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు దర్శన్ ను అదుపులోకి తీసుకున్నారు .. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అసభ్యకర మెసేజ్లతో నేను కూడా ఇబ్బంది పడ్డా…

Ramya: I got a lot of trouble with the obscene messages .. But..!
Ramya: I got a lot of trouble with the obscene messages .. But..!

ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలోనే కాదు ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో కూడా దీని పైన పెద్ద చర్చ జరుగుతోంది. దర్శన్ ను సినిమాల నుంచి బ్యాన్ చేయాలని కొంతమంది డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను కూడా ఇలా అసభ్యకర మెసేజ్లకు ఇబ్బంది పడ్డాను అంటూ తెలుపుతోంది నటి రమ్య.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు.. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అభిమన్యు అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తెలుగు, తమిళ్ తో పాటు కన్నడ భాషలో కూడా సినిమాలు చేసింది. తమిళ్లో సూర్య హీరోగా నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న రమ్య.. 2013లో మాండ్య నియోజకవర్గంలో నుండి లోక్ సభ ఎంపీ గా ఎన్నికయింది..

దర్శన్ చేసింది తప్పు..

తాజాగా రమ్య దర్శన్ వ్యవహారంపై మాట్లాడుతూ.. దర్శన్ చేసిన దారుణాన్ని ఆమె ఖండించింది.. అసభ్యకర మెసేజ్లు ట్రోల్స్ కి నేను కూడా గురయ్యాను.. అయితే మనల్ని ఎవరైనా మెసేజ్ లతో ఇబ్బంది పెడితే బ్లాక్ చేసే అవకాశం ఉంది.. ట్రోల్స్ ఎక్కువైతే మీరు ఫిర్యాదు చేయవచ్చు.. నన్ను కూడా చెడు పదాలతో భారీగా ట్రోల్ చేశారు.. నేనే కాదు నాలాగా చాలామంది ఈ ట్రోల్స్ కి గురయ్యారు.. ఇతరుల భార్యలు పిల్లలను ట్రోల్ చేసే వారు కూడా చాలామంది ఉన్నారు మనం ఒక చెడ్డ సమాజంలో ఉన్నాము చట్టాన్ని గౌరవించే ప్రతి పౌరుడిలాగే నేను కూడా ఫిర్యాదు చేశాను.. అలాంటి వారిని పోలీసులు హెచ్చరించడంతో పాపం కేసు కూడా వెనక్కి తీసుకున్నాను. టోల్స్ చేసేవారికి మంచి భవిష్యత్తు ఉంది.. కొన్ని ఫేక్ ఖాతాల ద్వారా ట్రోల్స్ చేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అంటూ రమ్య తెలిపింది..

- Advertisement -

చట్టాన్ని కాపాడ్డానికి పోలీసులు ఉన్నారు..

చట్టం ఎవరి చుట్టం కాదు.. ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. మీరు వెళ్లి మనుషులను కొట్టి చంపకండి.. ఒక సాధారణ ఫిర్యాదు సరిపోతుంది.. పోలీసులపై నాకు నమ్మకముంది.. రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు లొంగరని , చట్టంపై ప్రజల ఆశలు నిలుపుకుంటారని నమ్ముతున్నాను అంటూ తన ఇన్స్టా స్టోరీ లో రమ్య రాసుకొచ్చింది.. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది..

 

View this post on Instagram

 

A post shared by Ramya|Divya Spandana (@divyaspandana)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు