Ramyakrishna : నాలుగు నెలల గర్భిణీగా..

సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. తన అంద చెందాలతో పాటు నటనతో కొన్నాళ్లపాటు తెలుగువారిని అలరించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ. టాలీవుడ్ లో మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జగపతిబాబు వంటి హీరోలతో హీరోయిన్ గా చేసింది.

వెళ్లై మనసు అనే తమిళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన రమ్యకృష్ణ.. ఆ తర్వాత మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 200 పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రభాస్ బాహుబలి సినిమాలో శివగామిగా అదరగొట్టిన రమ్యకృష్ణకు.. మరోసారి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ” లైగర్” లోను హీరో తల్లి పాత్రలో కనిపించి రిసౌండ్ తెప్పించింది. ప్రస్తుతం మాత్రం పలు సినిమాలలో కీలకపాత్రలు చేస్తూ.. టీవీ షోలలో జడ్జిగా మెరుస్తోంది.

రమ్యకృష్ణ ఆహా ఓటీటి లో స్ట్రీమింగ్ అవుతున్న ” డాన్స్ ఐకాన్” షోలో ఒక జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో తన గురించి ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ ని రివీల్ చేశారు. ఈ షోలో డాన్సర్స్ తాను నటించిన ” నా అల్లుడు” సినిమాలో స్పెషల్ సాంగ్ ” సయ్యా సయ్యారేే” అనే పాటకి డాన్స్ చేశారు. ఈ పర్ఫామెన్స్ పూర్తయిన తర్వాత రమ్యకృష్ణ ఈ పాట గురించి మాట్లాడింది. సినిమాలో ఈ సాంగ్ కి డాన్స్ చేసే టైంలో తాను 4 నెలల గర్భిణీ అని, అందుకే ఈ పాటని అంత త్వరగా మరిచిపోలేనని చెప్పింది. ఈ పాటలో ఎన్టీఆర్ ఎనర్జీ, మాస్ స్టెప్పులు సూపర్ గా ఉన్నాయని రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు