Rana Daggupati: నా Life అంత కొత్త సినిమాలు చేస్తూ వచ్చాను…

Rana Daggupati: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రానా. మొదటి సినిమాతోనే మంచి హీరో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దొరికాడు అని అనిపించుకున్నాడు. లీడర్ సినిమా చూస్తున్నంత సేపు కూడా రానాలో శేఖర్ కమ్ముల కనిపిస్తాడు. అంత ప్రొఫెషనల్ గా ఆ సినిమాలు నటిస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు రానా. ఆ తర్వాత రానా ఎన్నో రకమైన కొత్త సినిమాలు చేశాడు. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా రానా సినిమాలు చేయటం అప్పటినుండే మొదలుపెట్టాడు.

రానా కి ఉన్న బాక్గ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాతయ్య మూవీ మొఘల్,నాన్న ప్రఖ్యాత నిర్మాత,బాబాయ్ స్టార్ హీరో అయినప్పటికీ వారిని నమ్ముకుని ప్రయాణం చేయలేదు.ఎందుకంటే రానా కు తెలుసు బావిలో కప్పలా కాకుండా సముద్రంలో తిమింగలం ల ఈదాలి అని. బాహుబలి లాంటి సినిమాలో నటించినప్పటికీ సినిమా పై ఉన్న మక్కువతో “కేరాఫ్ కంచరపాలెం” లాంటి సినిమాను నిర్మించాడు.

Rana Daggubati

- Advertisement -

ఘాజి లాంటి అద్భుతమైన కాన్సెప్ట్ నమ్మి ,నిర్మించి, సంకల్ప రెడ్డి అనే డైరెక్టర్ ను ప్రోత్సహించి “నేషనల్ అవార్డు” అందుకునేలా చేసాడు.ఒకే పంథాలో సినిమాలు చేస్తున్న హీరోలకు. బాక్గ్రౌండ్ ఉన్న సక్సెస్ లేని హీరోలందరికీ రానా నే ఆదర్శం.రానా ప్రయాణమే నిదర్శనం. ఇకపోతే రానా రీసెంట్గా ఒక అవార్డు ఫంక్షన్ కు హాజరై తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.నా లైఫ్ అంత కొత్త సినిమాలు చేస్తూ వచ్చాను.ఇప్పుడు అవన్నీ మామూలు సినిమాలు అయిపోయాయి. అందరు చేస్తున్నారు. కొత్తది ఏమి చెయ్యాలి అని… నేను వెతుకుతున్న అంటూ రానా మాట్లాడారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు