RanaDaggupati : ఆ బ్యానర్ లో రానా కొత్త ప్రాజెక్ట్.. షూటింగ్ ఎప్పుడంటే?

Rakshasa Raju : టాలీవుడ్ హల్క్ దగ్గుపాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దగ్గుపాటి వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తన విలక్షణ నటనతో మెప్పిస్తూ పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు విలన్ గా, ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ బిజీ గా దూసుకుపోయాడు. అయితే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల దాదాపు రెండేళ్ల వరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. మధ్యలో స్పై లాంటి సినిమాల్లో చిన్న గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. అయితే ఆఫ్లైన్ లో మాత్రం బయట రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా కల్కిని బాలీవుడ్ లో ప్రమోట్ చేయడంలో రానా కీలక పాత్ర వహించాడు. అలాగే ’35’ అనే సినిమాని కూడా ప్రమోట్ చేసాడు. ఇక ఇప్పుడు త్వరలోనే హీరోగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే రానాతో రాక్షస రాజు అంటూ డైరెక్టర్ తేజ సినిమా ఎప్పుడో ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. కారణాలేంటో తెలీదు గాని రానా వేరే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

Rana Daggupati Upcoming movie Update

రానా కొత్త సినిమా.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్…

ఇక తాజాగా రానా కొత్త సినిమా గురించి అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం రజిని సినిమాలో విలన్ గా నటిస్తున్న రానా, తేజ సినిమాని ఇంకా స్టార్ట్ చేయలేదు. అయితే తాజాగా కిషోర్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రారంభించి, షూటింగ్ ని అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. ఈ సినిమాలో కెజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. రానా విరాట పర్వం తరవాత హీరోగా నటించబోయే సినిమా ఇదే కావడం విశేషం.

- Advertisement -

రాక్షస రాజు ఎప్పుడు?

ఇక రానా ఈ మధ్యనే పలు సినిమాల ప్రమోషన్లలో సందడి చేసిన రానా రజినీకాంత్ వెట్టయిన్ సినిమాలో తన పార్ట్ ని తొందర్లోనే ఫినిష్ చేసి కొత్త సినిమా సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. అయితే తేజతో సినిమా ఎప్పుడు అని అభిమానులు నెట్టింట అడుగుతున్నారు. రానాకీ నేనే రాజు నేనే మంత్రి వంటి సూపర్ హిట్ ఇచ్చిన తేజ చాలా రోజుల తర్వాత రానాతో సినిమా అనౌన్స్ చేయగా, ఈ సినిమాపై క్రేజీ బజ్ ఉంది. అయితే తేజ ఈ సినిమా స్క్రిప్ట్ డెవలెప్మెంట్ కోసం సినిమా ఇంకా మొదలుపెట్టలేదని, ఆ వర్క్ పూర్తయిన వెంటనే ప్రారంభిస్తారని టాక్. మరి రానా నుండి ముందుగా ఏ సినిమా మొదలవుతుందో, ఏది థియేటర్లో ముందు విడుదల అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు