Rana Daggubati: కొత్త డైరెక్టర్​కు రానా గ్రీన్​సిగ్నల్ ?

Rana Daggubati: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ హీరో రానానాయుడు అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఈ సిరీస్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవడంతో పాటుగా అనేక రకాల విమర్శలను ఎదుర్కొంది. నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ రామానాయుడు కుమారుడు సురేష్ బాబు కుమారుడే.

ఈ రానా అసలు పేరు రామానాయుడు కాగా…. పేరు పెద్దగా అయ్యిందని తన కుటుంబసభ్యులు రానా అని పిలవడం ప్రారంభించారు. ఇక అదే పేరును స్క్రీన్ నేమ్ గా ఫిక్స్ చేశారు. ఇక రానా 2010 లో లీడర్ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత రానాకు బ్రేక్ వచ్చిన సినిమా బాహుబలి అనే చెప్పాలి. ఆ సినిమాలో రానా విలన్ పాత్రలో నటించి ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డాడు.

ఇదిలా ఉండగా…దగ్గుబాటి రానా కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. విరాటపర్వం సినిమా వచ్చి రెండేళ్లు అవుతున్నప్పటికీ దగ్గుబాటి రానా ఇప్పటివరకు మళ్ళీ పూర్తిస్థాయి సినిమాలో నటించలేదు. అయితే ఇటీవలే రానా కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక రానా గత రెండేళ్ల నుంచి ఎక్కువగా సినిమాల్లో కేవలం అతిధి పాత్రలోనే కనిపిస్తున్నారు. ఇక మళ్లీ హీరోగా పూర్తిస్థాయి సినిమా చేయబోతున్నాడని తెలిసి రానా అభిమానులు ఎంతో సంబరపడిపోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు