Rana : చ‌ర‌ణ్ నేనూ కంబైన్డ్ స్ట‌డీస్ పేరుతో.. అలా ఇంట్లోంచి పారిపోయేవాళ్లం

Rana : టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్స్ లో రామ్ చరణ్, రానా శర్వానంద్ ముగ్గురూ ముంటుంటారు. ఈ ముగ్గురు తమ చిన్నప్పటి స్కూల్ నుండే క్లాస్ మేట్స్ అని ఫ్యాన్స్ కి తెలిసిందే. కలిసి సినిమాలు చేయకపోయినా, ఆఫ్లైన్ లో ఎప్పటికప్పుడు తమ ఫ్రెండ్షిప్ ని బయటపెడుతూనే ఉంటారు. పలుమార్లు సోషల్ మీడియాలో కూడా పార్టీల్లో వైరల్ అవుతుంటారు. ముఖ్యంగా చరణ్, రానా తోడు దొంగలని చిరు కూడా సరదాగా అంటుంటాడు. రానా పెళ్లి చేసుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబెర్స్ సమక్షంలో మాత్రమే తన పెళ్లి జరుగగా, అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా రామ్ చరణ్ (Ram charan) నిలిచాడంటే వీళ్ళు ఎంత క్లోజో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా రానా, రామ్ చరణ్ తో తన ఫ్రెండ్షిప్ గురించి, తాము చిన్నతనంలో చేసిన పనుల గురించి “35చిన్న కథ కాదు” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ సందర్బంలో చెప్పుకొచ్చాడు.

Rana interesting facts about his friendship with Ram Charan

కంబైన్డ్ స్టడీస్ పేరుతో చరణ్, నేను పారిపోయేవాళ్ళం – సుమ

ఇక రానా దగ్గుబాటి (Rana) సమర్పకుడిగా వ్యవహరిస్తున్న “35 చిన్న కథ కాదు” (35 Chinnakathakaadu) ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగగా, ఈ ఈవెంట్ కి నాని గెస్ట్ గా వచ్చాడు. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న రానా, తన చైల్డ్ హుడ్ స్టడీ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. యాంకర్ సుమ (Suma) రానా ఫ్రెండ్స్ పిక్స్ స్క్రీన్ పై వేస్తూ.. వాళ్ళతో తన ఫ్రెండ్స్ గురించి ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ చెప్పమంది. అప్పుడు స్క్రీన్ పై రామ్ చరణ్ పిక్ రాగా, చరణ్ తో తన స్కూల్ డేస్ మెమొరీస్ ని, స్టడీ లైఫ్ గురించి ప్రస్తావిస్తూ ఇలా చెప్పుకొచ్చాడు.. చరణ్ తో తాను కంబైన్డ్ స్టడీస్ చేసేవాడినని, ఇంట్లో పెద్ద వాళ్లకు కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నాం అని చెప్పి, గదిలోకెళ్ళి, అక్కడ కిటికీల గ్రిల్ తీసేసి ఇంట్లో నుండి బయటికి పారిపోయేవాళ్ళం అని రానా చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్నీ రామ్ చరణ్ కూడా ఓ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. ఇక వీరి కాంబినేషన్ లో ఓ సాలిడ్ సినిమా రావాలని ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్నారు.

- Advertisement -

ఈ వారమే థియేటర్లలో 35CKK..

ఇక దగ్గుపాటి రానా (Rana) సమర్పణలో తెరకెక్కిన సినిమా “35చిన్న కథ కాదు” గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తుండగా, ఫైనల్ గా సెప్టెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా స్టార్ట్ అవగా, ఓవర్సీస్ లో, హైదరాబాద్ వంటి ఏరియాల్లో మంచి బుకింగ్స్ జరుగుతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో నివేదా థామస్ (Niveda Thamous), విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాకు బి.నందకిషోర్ దర్శకత్వం వహించడం జరిగింది. మరి థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు