Ranbir Kapoor: చీటర్ అన్నారు.. ఆ హీరోయిన్స్ తో డేటింగ్ పై స్పందించిన రణబీర్ కపూర్..!

Ranbir Kapoor.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను కూడా తన సినిమాలతో ఆకట్టుకుంటున్న రణబీర్ కపూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను కట్టిపడేసే ఈయన, గతంలో చీటర్ అనే బిరుదును తగిలించుకున్న విషయం తెలిసిందే. ఇక దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ట్యాగ్ పై మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్లు చేశారు.

Ranbir Kapoor: Cheater said.. Ranbir Kapoor reacted on dating those heroines..!
Ranbir Kapoor: Cheater said.. Ranbir Kapoor reacted on dating those heroines..!

చీటర్ ట్యాగ్ పై స్పందించిన రణబీర్ కపూర్..

తాజాగా పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ కపూర్ తనపై కావాలని కొంతమంది చీటర్ , కాసనోవా అనే ముద్రలు వేశారని , ఇప్పటికి కొంతమంది చీటర్ అనే ట్యాగ్ ను ఆపాదిస్తున్నారు అంటూ తెలిపారు. ముఖ్యంగా చీటర్ అనే ట్యాగ్ తనకు రావడం గురించి మాట్లాడుతూ.. గతంలో నేను ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేశాను. కానీ ఆ ఇద్దరితో కూడా విడిపోవలసి వచ్చింది. ఆ సమయంలోనే ఆ స్టార్ హీరోయిన్స్ అభిమానులు నాకు చీటర్ అనే ట్యాగ్ ను తగిలించారు. నా జీవితంలో సగానికి పైగా జీవితం మోసగాడు అనే లేబుల్ తోనే జీవించాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా కొంతమంది ఆ ట్యాగ్ ను ఆపాదిస్తున్నారు. నాకు పెళ్లయింది, కూతురు ఉంది. అయినా కూడా అలాంటి ట్యాగులతో నేను సుతమతమవుతున్నాను అంటూ తెలిపారు రణబీర్ కపూర్.

స్టార్ హీరోయిన్స్ తో రణబీర్ కపూర్ ప్రేమాయణం..

ఇకపోతే గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన దీపికా పదుకొనే , కత్రినా కైఫ్లతో రణబీర్ కపూర్ ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరితో కూడా ఆయన బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ సమయంలో ఈ స్టార్ హీరోయిన్స్ కి జరిగిన అన్యాయం కారణంగానే రణబీర్ కపూర్ కి చీటర్ అనే ట్యాగ్ తగిలించారు అభిమానులు.

- Advertisement -

తండ్రి రిషి కపూర్ పై రణబీర్ కామెంట్స్..

తండ్రి రిషి కపూర్ గురించి మాట్లాడుతూ.. మా నాన్న అంటే మాకు చాలా భయం. నిజానికి ఆయనకు కోపం ఎక్కువ. కానీ మంచి వ్యక్తి . చిన్నతనంలోనే ఆయనతో మాట్లాడాలంటే చాలా భయపడే వాడిని. ఆయన కళ్ళల్లోకి కూడా నేను చూసేవాడిని కాదు. పైగా ఆయన కనుపాప రంగు కూడా నాకు తెలియదు. ఆయన ముందు నిలిచి ఉంటే కచ్చితంగా తలదించుకొని నిల్చొనే వాడిని. ఆయన ఏం చెప్పినా సరే.. నో అని ఏ రోజు కూడా చెప్పలేదు. అయితే ఆయన మరణం మా జీవితాల్లో తీరని లోటు మిగిల్చింది అంటూ తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు రణబీర్ కపూర్.

కూతురిపై అలాంటి కామెంట్..

కూతురు రాహా గురించి మాట్లాడుతూ.. రాహా రాక నా జీవితానికి కొత్త వెలుగులు తీసుకొచ్చింది. అంతేకాదు ఆమె మా జీవితంలోకి వచ్చిన తర్వాత మా జీవితం మరింత ఆనందమయం అయింది. ప్రస్తుతం రాహా మా ప్రపంచం అయిపోయింది అంటూ తెలిపారు.

అలియాతో ప్రేమాయణం..

మహేష్ భట్ వారసురాలు అలియా భట్ తో దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ప్రేమాయణం నడిపిన రణబీర్ కపూర్ వివాహానికి ముందే ఆమెతో శారీరకంగా సంబంధం పెట్టుకొని ఆమెను గర్భవతిని చేశారు .ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన ఆరు నెలలకు అలియా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు