Ranbir Kapoor: మాసివ్ లైనప్… రణబీర్ చేతిలో ఎన్ని పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయంటే?

Ranbir Kapoor: “అనిమల్” హీరో రణబీర్ కపూర్ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. పాన్ ఇండియా స్టార్ గా ఆయన సాలిడ్ లైనప్ చూస్తే తన తోటి హీరోలకు జెలసి పుట్టడం ఖాయం. తాజాగా “అనిమల్” రూపంలో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని, ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు రణబీర్. ఇక నెక్స్ట్ ఈ హీరో చేయబోతున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.

ఒకసారి రణబీర్ కపూర్ సాలిడ్ లైనప్ చూస్తే… “దంగల్” డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వం వహించనున్న “రామాయణం” మూవీలో రణబీర్ రాముడుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి సీతాదేవి పాత్రను పోషించనుంది. కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడి పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ మూడు భాగాలుగా రాబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందునున్న ఈ ప్రాజెక్టు తో పాటు రణబీర్ ఖాతాలో సంజయ్ లీలా భన్సాలీతో మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఉంది.

ఈ ప్రాజెక్టును తాజాగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో “సావరియా” అనే సినిమా రాగా, మరోసారి రణబీర్, సంజయ్ కాంబో రిపీట్ కావడానికి 17 ఏళ్లు పట్టింది. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు రణబీర్ లైనప్ లో మరో మూడు మాసివ్ సినిమాలు ఉన్నాయి.

- Advertisement -

“అనిమల్” మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ రూపొందించబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. “అనిమల్ పార్క్” అనే టైటిల్ తో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందునున్న ఈ మోస్ట్ వైలెన్స్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత రణబీర్ హీరోగా నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ “బ్రహ్మస్త్ర” సీక్వెల్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇక రణబీర్ ఖాతాలో రాజ్ కుమార్ హిరానీతో చేయాల్సిన మరో ప్రాజెక్టు కూడా ఉంది. నిజానికి ఈ మూవీ ఇంకా చర్చల దశలోనే ఉంది.

మొత్తానికి ఈ హీరో చేతిలో ఏకంగా ఐదారు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉండడం విశేషం. ఇవి కేవలం భారీ బడ్జెట్ మాత్రమే కాదు 1000 కోట్ల కలెక్షన్లు కొల్లగట్టే సత్తా ఉన్న సినిమాలు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో ఈ రేంజ్ లో మాసివ్ లైన్ అప్ ఉన్న హీరో రణబీర్ ఒక్కడే. ఇక వీటిలో ఏ ఒక్క సినిమా అయినా అనిమల్ రేంజ్ లో ఆడితే గనక రణబీర్ జోరును ఆపడం ఎవరి తరం కాదు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు