Ranbir Kapoor: ఆ పాత్ర కోసం రోజూ అన్ని గంటలు కష్టపడుతున్నాను , మోస్ట్ ఛాలెంజింగ్ రోల్

Ranbir Kapoor: కొన్ని పాత్రలు కొందరి కోసమే పుడతాయి అంటారు. అయితే ఆ పాత్రల్లో ఆ నటులు సరిపోయిన కూడా ఆ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు తప్పిదం వలన ఆ సినిమాకు ఆ కథకి ఉన్న వాల్యూ పోతుంది. అచ్చం అదే జరిగింది ఆది పురుష్ సినిమాకి. ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ రామాయణం కాదని చేయాలి ఉంది అని అన్న మాటలు విని బాహుబలి సినిమా తర్వాత ఓంరౌత్ ప్రభాస్ దగ్గరికి వెళ్లి ఈ కథను చెప్పేసాడు. మరి ప్రభాస్ కి ఏం చెప్పాడో తెలియదు గానీ ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఆ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గట్టిగా మాట్లాడితే ఆ సినిమా గురించి ఎంత తప్పు మాట్లాడితే అంత మంచిది. ఆ సినిమాకి ఏదైనా ప్లస్ ఉంది అంటే సినిమాలో ఉన్న కొన్ని పాటలు.

ఇకపోతే నితీష్ తివారి దర్శకుడుగా రామాయణం సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రన్బీర్ కపూర్ రాముడు పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక రన్బీర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపును సాధించాడు. తెలుగు ప్రేక్షకులకు భాష అర్థం కాకపోయినా కూడా హిందీలో రన్బీర్ సినిమాలు చూసి ఫ్యాన్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు కూడా మరింత దగ్గరయిపోయాడు.

Ranbir Kapoor

- Advertisement -

ఇకపోతే నితీష్ దర్శకత్వం వహిస్తున్న రామాయణం సినిమాలో ఎస్ రావణుడు పాత్రలో కనిపిస్తున్నాడు. సీతాదేవి పాత్రలో సాయి పల్లవి కనిపిస్తోంది. అయితే రాముడు పాత్ర అనేది చాలా ప్రెస్టేజ్ రోల్ అని. దాదాపు ఈ రోల్ కు సంబంధించి మేకప్ కు మూడు నాలుగు గంటలు టైం పడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇది చాలా ఛాలెంజింగ్ రోల్ అంటూ రన్బీర్ చెప్పాడు. ఇక రన్బీర్ తన కెరియర్ లో ఎన్నో క్లిష్టమైన పాత్రలను చేశాడు. ఇక రాముడు పాత్రలో ప్రేక్షకులకు ఎలా కనిపిస్తాడో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు