Rangasthalam: సమంతకు పెళ్లయింది.. వద్దు అన్నారు.. కానీ చిరు మాట విని..?

Rangasthalam.. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా హీరోయిన్ సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం.. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు రామ్ చరణ్ – సమంత మధ్య కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులు అయిపోయారు.. అయితే ఇప్పుడు ఈ సినిమా క్రెడిట్ అంతా చిరంజీవికే అంటున్నారు రంగస్థలం డైరెక్టర్ సుకుమార్.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Rangasthalam: Samantha is married.. She said no.. but she listened to Chiru's words..?
Rangasthalam: Samantha is married.. She said no.. but she listened to Chiru’s words..?

కథల ఎంపిక విషయంలో చిరంజీవి తర్వాతే ఎవరైనా.

మెగాస్టార్ చిరంజీవికి ఒక సినిమాను అంచనా వేయడంలో భిన్నమైన శైలి ఉంటుంది. అందుకే ఆయన సక్సెస్ రేటు కూడా ఎక్కువే.. కథల ఎంపిక విషయంలో చిరంజీవిని చూసి నేర్చుకోవాలని.. ఎంతో మంది చెబుతూ ఉంటారు.. అయితే చిరంజీవి తీసిన అన్ని సినిమాలు సక్సెస్ కాలేదు కదా అంటే.. అదీ నిజమే.. ఒక్కొక్కసారి లెక్క తప్పి ఉండవచ్చు.. కానీ ఆ కథ స్వభావం ఏమిటి? ఏ హీరోకి కథ ఎలా సెట్ అవుతుంది? అని అంచనా వేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. ఇక అందుకే దిల్ రాజు సమర్పణలో జోష్ కథను రామ్ చరణ్ తో చేయాలి అంటే వద్దు ఇది ఆడదు అని రిజెక్ట్ చేశారు..

చిరంజీవి ఫోటోలను 5 పైసలుకు అమ్ముకున్న సుకుమార్..

అయితే సుకుమార్ చెప్పిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడిగా నటించాలి అని చెబితే అద్భుతమైన కథ అంటూ ప్రోత్సహించారట.. అందుకే సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా ఊహించని రికార్డులు దక్కించుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్ కు ఉత్తమ డైరెక్టర్ గా సైమా అవార్డు లభించగా అల్లు అరవింద్ చేతుల మీదుగా అందించారు..ఇక ఇప్పుడు సుకుమార్ మాట్లాడుతూ.. నాడు అరవింద్ చేతుల మీదుగా తీసుకున్న అవార్డు చిరంజీవికి దక్కుతుంది.. ఎందుకంటే నేను దర్శకుడిగా కంటే.. చిన్నప్పుడు చిరంజీవి ఫోటోలు ఐదు పైసలకి అమ్ముకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడిని.

- Advertisement -

సమంత గొప్ప నటి – చిరంజీవి

ఇదంతా ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే.. ఆయన ఆలోచన విధానం.. కథల ఎంపిక విషయంలో ట్రెండ్ కు తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇందులో హీరోయిన్ గా సమంతను తీసుకుందామా లేదా అని డైలమాలో ఉన్నప్పుడు.. చిత్ర యూనిట్ లో చాలామంది ఆమెకు పెళ్లి అయిపోయింది..వద్దు అన్నారు.. కానీ చిరంజీవి మాత్రం పెళ్లయితే ఏంటి.. ఆమె ఒక అద్భుత నటి.. సమంతానే ఫిక్స్ చేయండి అంటూ సలహా ఇచ్చారు.. సమంత బాగా నటిస్తుందా లేదా అని మాత్రమే అడియన్స్ చూస్తారు. ఆమెకు పెళ్లయిందా లేదా అన్న విషయాన్ని ఎవరు పట్టించుకోరు అంటూ చెప్పారట.. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని రాంచరణ్ చెవిటి వాడిగా అతడిని ప్రేమించే పల్లెటూరి అమ్మాయి పాత్రలో సమంత చాలా అద్భుతంగా ఒదిగిపోయారు.. ఇక సినిమా పూర్తి అయిన తర్వాత మూడు గంటల నిడివి ఉంది ఏం చేద్దామని మళ్లీ అడిగితే.. ఏం ప్రాబ్లం లేదు ఇలాగే రిలీజ్ చేయండి అని చెప్పారు.. అందులో ఎటువంటి ఎడిట్ కటింగ్ లేకుండా సినిమాని రిలీజ్ చేయగా.. సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇక ఈ క్రెడిట్ అంతా చిరంజీవికే దక్కుతుంది అంటూ సుకుమార్ చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు