RAPO20 : రామ్ కు 20… బోయపాటికి 10..!

తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ అనే ద్విభాషా చిత్రాన్ని ఇటీవల పూర్తి చేశాడు రామ్. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ మరియు టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. ఇంకా ప్రమోషన్స్ పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ చిత్రం విడుదల కాక ముందే  మరో సినిమాను లైన్ లో పెట్టాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. చాలా రోజుల క్రితమే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఇది 10 వ సినిమా కాగా.. రామ్ కు ఇది 20 వ సినిమా కావడం విశేషం. #RAPO20 వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈ చిత్ర బృందం షూటింగ్ ప్రారంభించబోతుంది. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాను ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బోయపాటి శ్రీను సినిమాల్లో హీరో చాలా మాస్ గా రఫ్ గా కనిపిస్తారు. రామ్ ఒకప్పుడు చాక్లెట్ బాయ్ ఇమేజ్ ను మెయింటైన్ చేశాడు. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ ‘రెడ్’ చిత్రాల్లో మాస్ యాంగిల్ ను కూడా చూపించాడు రామ్. ‘ది వారియర్’ కూడా మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి తీసిన చిత్రమే. కాబట్టి ఇప్పుడు బోయపాటితో చేస్తున్న ఈ సినిమాతో రామ్ మాస్ ఇమేజ్ డబుల్ అయ్యే అవకాశాలున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు