Rashi Khanna: వారికి దగ్గరైతేనే..సక్సెస్‌ అవుతాం !

 

Rashi Khanna: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో క్యూట్ బ్యూటీ రాశి కన్నా గురించి ప్రత్యేకంగా సినీ అభిమానులకు చెప్పనవసరం లేదు. 2013 సంవత్సరంలో “మద్రాస్ కెఫె” అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ క్యూట్ బ్యూటీ. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

తన అమాయకపు నటన, అందంతో ఎంతోమంది అభిమానులను తన వైపుకు తిప్పుకుంది. రాశి కన్నా ప్రస్తుతం తెలుగులో పెద్దగా నటించడం లేదు. దాదాపు ఈ బ్యూటీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లకు పైనే అవుతుంది. ఇదిలా ఉండగా…. తాజాగా ఈ బ్యూటీ నటించిన తమిళ చిత్రం అరణ్మనై 4. ఈ చిత్రం సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటుగా 100కోట్ల క్లబ్ లో చేరిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా తాజాగా రాశి కన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ….తెలుగు, తమిళం భాషలను నేను అర్థం చేసుకొని మాట్లాడగలుగుతానని చెప్పింది.

- Advertisement -

అంతకుముందు నటించిన రెండు తమిళ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయని తాజాగా అరణ్మనై 4 చిత్రంలో నేను నటించడం… ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడం నాకు ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. తాను హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రస్తుతం నటిస్తున్నానని….భాష అర్థమైతే ప్రేక్షకులకు చాలా సులభంగా దగ్గరవచ్చని…. తనకు ఆ విషయం తెలుసని చెప్పుకొచ్చింది. ఫ్యాన్స్‌ కు దగ్గరైతేనే..సక్సెస్‌ అవుతామన్నారు. కాగా, రాశి కన్నాకి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా రాశి కన్నాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాశి కన్నా పోస్ట్ చేసే పోస్టులకు ఫోటోలకు లైక్స్ భారీగానే వస్తాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు