Rashi khanna: బేబీతో రాశిఖన్నా… కంగ్రాట్స్ అంటూ పోస్టులు?

Rashi khanna: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్ రాశి కన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అది తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. ఈ భామ చూడడానికి ఎంతో చక్కగా, అందంగా కనిపించడంతో అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. 1990 సంవత్సరంలో జన్మించిన రాశి ఢిల్లీ యూనివర్సిటీలో తన చదువును పూర్తి చేసింది. అనంతరం మోడలింగ్ మీద ఉన్న ఆసక్తితో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది.

2013 సంవత్సరంలో మద్రాస్ కెఫే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2014 సంవత్సరంలో మనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది ఈ బ్యూటీ. అయితే ఊహలు గుసగుసలాడే సినిమాతో బంపర్ విజయాన్ని అందుకున్న రాశికన్నా ఆ సినిమా అనంతరం బెంగాల్ టైగర్, సుప్రీమ్, శివమ్ వంటి అనేక బంపర్ హిట్ విజయాలను అందుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం రాసి కన్నా తెలుగులో కన్నా బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

అయితే తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదని చాలామంది ఆరా తీయగా….దానికి గల కారణాలు వెలుగులోకి వచ్చాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో రాశి కన్నాను చాలా టార్చర్ పెట్టారట. తన బాడీపై నెగిటివ్ గా కామెంట్స్ చేశారట ఆ హీరో. అయితే గొడవలు పెట్టుకోవడం ఎందుకు అనుకున్న రాశి కన్నా ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టిందట. ఇక అప్పటినుంచి ఆ హీరోతో మాట్లాడటం, సినిమాలు చేయడం మానేయాలని నిర్ణయం తీసుకుందట. అందుకే రాశి ఎక్కువగా హిందీలోనే సినిమాలు చేస్తుంది.

- Advertisement -

Rashi Khanna's feast of beauty in yellow chudidar

ఇది ఇలా ఉండగా….ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా రాశి కన్నా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూసిన చాలామంది షాక్ అవుతున్నారు. అయితే ఆ ఫోటోలో రాశి కన్నా ఒక చిన్న పాపను ఎత్తుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన చాలామంది రాశి కన్నాకు పుట్టినట్లే ఉందని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ అమ్మాయి వారి కుటుంబంలో జన్మించిన అమ్మాయిగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసి చాలామంది షాక్ లో మునిగిపోయారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు