Rashmi Gautham : పబ్లిక్ గా వైన్ తాగుతూ ఫోటోలకు ఫోజులిచ్చిన రష్మీ… హగ్స్, కిస్సెస్ కూడా!!

Rashmi Gautham : యాంకర్ రష్మీ గౌతమ్ తాజాగా వైన్ తాగుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. పైగా మందు బాటిల్ కు ముద్దులు, హగ్గులు ఇస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

జబర్దస్త్ యాంకర్..

జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్ గా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది రష్మి గౌతమ్. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు రీల్స్ చేస్తూ తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ జబర్దస్త్ షో చేస్తూనే మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ షోని కూడా సక్సెస్ ఫుల్ గా ముందుండి నడిపిస్తోంది. ఈ రెండు షోలలో ఆమె అందాలు, మాటలు అదిరిపోయే పంచులు, ఎక్స్ప్రెషన్స్ మెయిన్ హైలెట్ అని చెప్పొచ్చు.

మందు బాటిల్ ని చూసి ఆగలేక..

తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఓ పెద్ద వైన్ బాటిల్ కి ముద్దు పెడుతూ కనిపించింది. అంతేకాదు వాటిని చూసిన ఆనందాన్ని తట్టుకోలేక హగ్గులు కూడా ఇచ్చింది. ఓ గ్లాసులో పెగ్గేస్తూ ఫోటోలకు చిలిపిగా ఫోజులు కూడా ఇచ్చింది. ప్రస్తుతం తన బర్త్ డే సందర్భంగా వెకేషన్ ట్రిప్ లో ఉన్న రష్మీ గౌతమ్ ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

యానిమల్ లవర్..

ఇక ఈ బ్యూటీ యాంకర్ నటి మాత్రమే కాదు యానిమల్స్ పై తరచుగా ప్రేమను చూపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో డిబేట్లు పెట్టి మరీ తనను తాను డాగ్స్ లవర్ గా ప్రూవ్ చేసుకుంటుంది. కుక్కలు మాత్రమే కాదు బర్రెలు, ఆవులు లాంటి మూగజీవులకు ఏం జరిగినా ఆమె తట్టుకోలేదు. మూగ జీవాలను హింసించే వీడియోలు ఎక్కడ కనిపించినా వెంటనే రియాక్ట్ అయ్యి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది. వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు ఎవరినైనా కలిసినా సరే తప్పు యజమానులదే అంటుంది. యజమానులు చేసే తప్పుల వల్లే అవి అలా ప్రవర్తిస్తాయి. కాబట్టి శిక్ష యజమానులకే పడాలి అంటూ వాదిస్తుంది. అలాగే తనపై ఎవరైనా ట్రోలింగ్ చేస్తే ఏమాత్రం ఊరుకోదు ఈ హాట్ బ్యూటీ. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి వెంటనే ఇచ్చి పడేస్తుంది.

చివరగా రష్మి నటించిన మూవీ

ఇలా యాంకర్ గా, సోషలిస్టుగా మాత్రమే కాకుండా హీరోయిన్ గా కూడా రాణించాలనుకున్నది ఈ చిన్నది. ఇప్పటిదాకా పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. దీంతో చివరగా ఆమె మెగాస్టార్ తో కలిసి ఏకంగా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ పాటలో అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేసింది. అందాలన్నీ చూపిస్తూ రెచ్చిపోయినప్పటికీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమెకు కొత్త ఆఫర్లు రాలేదు. అయితే బుల్లితెరపై మాత్రం ఇప్పటికి ఆమె హవానే నడుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు