Rashmika: ఇంగ్లీష్ లో మాట్లాడాలన్న ఫ్యాన్స్.. ఆన్సర్ వింటే షాక్.. తెలివైనదే..!

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లు తాము నటించిన సినిమా ప్రమోషన్స్ లో కచ్చితంగా పాల్గొని.. అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క హీరోయిన్ కి లేదా హీరోకి పాన్ ఇండియా వైడ్ గా అభిమానులు ఉన్నారు.. ఈ క్రమంలోనే వారు ఏ ప్రాంతానికి ప్రమోషన్స్ కి వెళ్తే.. ఆ ప్రాంతం యొక్క భాషలోనే మాట్లాడాలని అభిమానులు కోరుతూ ఉంటారు.. ఇక అందులో భాగంగానే సదరు హీరోయిన్స్ కూడా ఎక్కడైతే ప్రమోషన్స్ చేస్తున్నారో..ఆ ప్రాంతం యొక్క భాషను నేర్చుకొని మరీ ఆ ప్రాంతం యొక్క భాషలో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక అలా వీరు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని ప్రాంతాల వారికి ఆ భాష రాక.. తమ అభిమాన హీరోయిన్ ఏం మాట్లాడుతోందో అర్థం కాక ఇంగ్లీషులో మాట్లాడమని కోరుతూ ఉంటారు.. ఇప్పుడు అలాంటి ఒక సంఘటన నేషనల్ క్రష్ రష్మిక కి ఎదురయ్యింది.. ఈ క్రమంలోనే నార్త్ ఇండియన్ అభిమానులు ఆమెను ఇంగ్లీష్ లో మాట్లాడమని కోరగా.. తనదైన శైలిలో సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈమె సమాధానం విని రష్మిక చాలా తెలివైనది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం..

గం గం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక..

ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం గం గం గణేశా.. ఈ సినిమా మే 31వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనింది రష్మిక . ఈ ఈవెంట్ లో రష్మిక.. ఆనంద్ అడిగిన ప్రశ్నలకు తెలుగులోనే సమాధానం ఇచ్చింది. దీనిపై రష్మిక దిల్లీ ఫ్యాన్స్ ఇంగ్లీష్ లో మాట్లాడమని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.. దీనికి రష్మిక ఈ విధంగా స్పందించింది..

ఇంగ్లీషులో మాట్లాడాలని కోరిన ఫ్యాన్స్

Rashmika: Fans to speak in English.. Shocked to hear the answer.. Smart..!
Rashmika: Fans to speak in English.. Shocked to hear the answer.. Smart..!

ముందుగా అభిమాని ఎక్స్ లో రష్మికకు సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. మేము మిమ్మల్ని చూసి ఎంత ఆనందిస్తామో.. మీ మాటలను విని అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తాము.. మీరు తెలుగులో మాట్లాడితే ఉత్తరాది వారికి అర్థం కాదు.. అందుకే ఇకపై ఏ ఈవెంట్లో అయినా సరే మీరు ఇంగ్లీషులోనే మాట్లాడండి అంటూ అడిగారు..

- Advertisement -

రష్మిక సమాధానం..

అందుకు రష్మిక స్పందిస్తూ .. మీరు చెప్పింది నిజమే.. ఇంగ్లీషులో మాట్లాడితే అందరూ అర్థం చేసుకుంటారు.. కానీ నేను వారి భాషలో మాట్లాడాలని చాలామంది కోరుకుంటారు.. అలా మాట్లాడకపోతే నాకు ఆ భాష తెలియదని.. దానిని నేను గౌరవించట్లేదని కూడా అనుకునే అవకాశం ఉంది.. అలా ఎవరైనా సరే అనుకోవడం నాకు నచ్చదు.. అందుకే ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయా భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను.. కానీ ఇకపై ఇంగ్లీష్ లో మాట్లాడడానికి కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను అంటూ తెలిపింది. రష్మిక.

రష్మిక సినిమాలు..

రష్మిక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈమె ఐదు సినిమాలలో నటిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2, రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ , చావా, కుబేర వంటి సినిమాలలో నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు