Rashmika: కథ లేకపోయినా కూడా సాయి రాజేష్ తో వర్క్ చేయాలని ఉంది

Rashmika: కన్నడ ఫిలిం ఇండస్ట్రీలు హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసిన రష్మిక చలో సినిమాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి హిట్టు అందుకుంది రష్మిక ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన చేసిన గీత గోవింద సినిమా బ్లాక్ బస్టర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత విజయ్ సరసన డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేదు కానీ ఇప్పటికీ ఈ సినిమాకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు జంటగా నటించింది రష్మిక. శ్రీవల్లి పాత్రలో నటించినా రష్మికకు ఈ సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభించింది. పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వల్ గా పుష్ప 2 అనే సినిమా రానుంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

అనిమల్ సినిమాతో మరొక హిట్

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. మొదటి సినిమాతోనే అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి అప్పట్లో శివ సినిమా తర్వాత ఇప్పట్లో అర్జున్ రెడ్డి అనెంతల ఇంపాక్ట్ లా చూపించాడు. ఇదే సినిమాని కబీర్ సింగ్ అనే పేరుతో హిందీలో తెరకెక్కించి అక్కడ కూడా అద్భుతమైన ఘనవిజయం సాధించాడు. ఈ సినిమాలో రన్బీర్ కపూర్ సరసన రష్మిక మందన నటించింది. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా తర్వాత రష్మిక రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

- Advertisement -

Rashmika Mandanna

సాయి రాజేష్ తో వర్క్ చేయాలని ఉంది

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ చేస్తున్న సినిమా గం గం గణేశా. ఈ సినిమా మే 31న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్ కి రష్మిక మందన చీఫ్ గెస్ట్ గా హాజరైంది. ఈ సినిమా గురించి రష్మిక మాట్లాడుతున్న తరుణంలో, బేబీ అనే సినిమా నేను చూశాను. సినిమా చూసిన వెంటనే ఏడ్చేశాను. నాకు వెంటనే సాయిరాజేష్ తో వర్క్ చేయాలి అని అనిపించింది. కథ ఉన్నా లేకపోయినా కూడా సాయి రాజేష్ తో పని చేయాలి. సాయి రాజేష్ దర్శకత్వంలో ఒక మెంటల్ పాత్ర చేయాలి. అంటూ బేబీ సినిమా గురించి చెప్పుకొచ్చింది రష్మిక.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు