Rashmika Mandanna: రష్మికకు తీవ్ర అస్వస్థత..ఫోటోలు వైరల్‌?

 

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ ఛలో సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు తాను నటించిన మొదటి సినిమా సమయం నుంచి ఇప్పటివరకు వరుసగా సినిమాలు చేసుకుంటూ బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. ప్రస్తుతం రష్మిక పుష్ప టు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో రష్మిక మందన ఒకరు. తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకుంది.

ఎప్పుడూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. తాను నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో నంబర్ వన్ హీరోయిన్ గా నిలబెట్టాయి. గతేడాదే రష్మిక యానిమల్, సీతారామం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఇక రష్మిక పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కించుకుంది. ఇక పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్పటు సినిమాను తీస్తున్నారు.

- Advertisement -

ఇక ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పాటలు పెండింగ్ లో ఉన్నాయి. ఇక రష్మిక ఓవైపు షూటింగ్స్ లో పాల్గొంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాలను షేర్ చేసుకోవడమే కాకుండా పలు రకాల పోస్టులు చేస్తూ నెటిజెన్లను ఆకట్టుకుంటుంది.

Rashmika Mandanna extremely unwell, shares health update with new Insta pic

తాజాగా…. ఈ అమ్మడు పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. “చాలా అస్వస్థతగా ఉంది నాకు. కానీ నేను కొందరిని ఫూల్స్ చేయడం ఆపడం లేదు”అనే క్యాప్షన్ జత చేసింది. అంతేకాకుండా ఫ్రీ హెయిర్ లో అందమైన గులాబీ పువ్వులను పెట్టుకొని నవ్వుతూ స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా…. తన అభిమానులు ఈ ఫోటోలు చూసి మురిసిపోతున్నారు. రష్మిక ఎలాంటి పోస్టులు పెట్టిన విపరీతమైన లైక్స్ వస్తాయి. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు