Allu Arjun : ఎంత పని చేశావ్ బన్ని… అల్లు అర్జున్‌పై రష్మిక ఫైర్

Allu Arjun : రష్మిక సినిమా కెరీర్ ఓ టైంలో ఎడ్ అయ్యే పరిస్థితి. ఇటు తెలుగులో, అటు హిందీలో ఎక్కడా సినిమాలు చేసినా.. డిజాస్టర్. ఆ టైంలో ఓ ఛాన్స్ వచ్చింది. అప్పుడు అది ఓ ఛాన్స్.. కానీ, రిలీజ్ అయ్యాకా తెలిసింది అది కెరీర్ మళ్లీ టర్న్ చేసే ఛాన్స్ అని. అదే పుష్ప. అలాంటి బిగ్ ఛాన్స్ ఇచ్చింది అల్లు అర్జున్. అలాంటి బన్నిపై రష్మిక ఫైర్ అయిందట. ఎందుకో మరి ఇప్పుడు చూద్ధాం…

అల్లు అర్జున్ – రష్మిక జంటగా నటించిన పుష్ప సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ అనే టైటిల్‌తో వస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సింది. కానీ, షూటింగ్ పూర్తి కాకపోవడం, వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ తో పాటు మరిన్నీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం అవ్వడంతో, వాయిదా పడింది. దీన్ని ఈ ఏడాదే డిసెంబర్ 06న రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఇదే ఇప్పుడు అల్లు అర్జున్ పై రష్మిక కోపగించుకోవడానికి కారణం అయిందట.

Pushpa 2 Release date
Pushpa 2 Release date

కారణం ఏంటంటే…?

పుష్ప 2 డిసెంబర్ 06న వస్తే రష్మిక కు ఎందుకు కోపం అని అనుకుంటున్నారా..? ఉంది ఓ చిన్న సమస్య ఉంది. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో చావా మూవీ ఒకటి. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చావా మూవీ ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. దీనిలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటిస్తున్నారు. దీన్ని ఇదే డేట్ కు రిలీజ్ చేయ్యాలని నిర్మాతలు అనుకుంటున్నారు. అదే జరిగితే, చావా – పుష్ప 2 మధ్య పోటీ తప్పదు.

- Advertisement -

హిందీలో పుష్ప రాజ్ హవా..

అన్ని సక్రమంగా ఉంటే, ఆగస్ట్ 15న పుష్ప 2 రిలీజ్ అయితే, రష్మిక కు పెద్దగా సమస్య ఉండేది కాదు. కానీ, వాయిదా వల్ల… చాలా హోప్స్ పెట్టుకున్న చావా మూవీపై ఎఫెక్ట్ తప్పదు. నిజానికి పుష్ప 2 తెలుగు సినిమా అయినా, హిందీలో మంచి హైప్ ఉంది. మొదటి పార్ట్ కూడా హిందీ రాష్ట్రాల్లో భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు పార్ట్ 2 కు కూడా అలాంటి రిజల్ట్ వస్తుందని హోప్స్ ఉన్నాయి. అలాంటి మూవీ చావాకు పోటీ వస్తే ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది.

అందుకే బన్నీ పై రష్మిక మందన్నా అసంత్రుప్తితో ఉందట. ఇన్ని రోజులు వెయిట్ చేసి సరిగ్గా.. తనకు బాలీవుడ్ లో హిట్ వస్తుంది అని భావిస్తున్న చావా మూవీకి పోటీగా రావాలా అని అనుకుంటుందట రష్మిక.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు