Rashmika: మరోసారి డీప్ ఫేక్ బారినపడ్డ రష్మిక.. ఫాన్స్ ఫైర్..!

Rashmika.. కన్నడ సినీ పరిశ్రమ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది హీరోయిన్ రష్మిక మందన్న.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటిస్తూ.. బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఇలా అన్ని భాషలలో సత్తా చాటుతోంది రష్మిక. రష్మిక క్రేజ్ ఎంత పెరుగుతుందో, అంత దిగజారేలా చేస్తున్నారు చాలామంది. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో రష్మిక డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు సైతం చాలా వైరల్ గా మారుతున్నాయి. వీటి పైన అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు.

Rashmika: Once again Rashmika has been affected by deep fake.. Fans fire..!
Rashmika: Once again Rashmika has been affected by deep fake.. Fans fire..!

ఏఐ టెక్నాలజీ ద్వారా ఎడిట్..

ప్రముఖ కొలంబియా మోడల్ డానియేలా ఇన్స్టా రీల్ ని ఏఐ టెక్నాలజీ ద్వారా ఎడిట్ చేసి, సెలబ్రెటీలను డీప్ ఫేక్ బారిన పడేటట్టు చేస్తూ ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే రష్మిక డీప్ ఫేక్ బారిన పడింది. అయితే ఇది మూడవసారి కావడంతో ఈ విషయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా జరిగింది. రష్మిక మాత్రమే కాకుండా.. హీరోయిన్ ఆలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా తదితర సెలబ్రిటీలు కూడా డీప్ ఫేక్ బారిన పడ్డట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరొకసారి రష్మికను మోడల్ డానియేలా మాదిరిగా ఎడిట్ చేసి మరొక వీడియోని విడుదల చేశారు.

PRITI RAJPUT అనే ఫేస్బుక్ అకౌంట్ నుండీ ఫేక్..

అయితే ఈ వీడియో మరింత అసభ్యకరంగా కనిపిస్తోంది. తాజాగా ఈ వీడియోని , ఫోటోలను సైతం విడుదల చేశారు. ముఖ్యంగా బ్లాక్ బికినీ ధరించిన అమ్మాయికి రష్మిక ఫేస్ ని యాడ్ చేసి మరి ఉంచారు. అయితే ఈ వీడియో PRITI RAJPUT అనే ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన వారందరూ ఒక్కసారిగా షాక్ అవడమే కాకుండా రష్మిక అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు. ఒక హీరోయిన్ పట్టుకొని ఎన్నిసార్లు డీప్ ఫేక్ వీడియోలు విడుదల అవుతున్నాయి అంటే అధికారులు ఏం చేస్తున్నారనే విధంగా ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

మార్ఫింగ్ ఫోటోలు చూసి రష్మిక షాక్..

మొదట ఈ ఫోటోలు చూసి రష్మికనే ఇలా ఫోటో షూట్ చేసిందా అనుకునేంతలోపే ఇది ఎడిట్ చేశారు అని ఆ తర్వాత అసలు విషయం తెలిసి పలువురు నెటిజెన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయం పైన రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. మొత్తానికి అయితే రష్మిక ప్రతిసారి ఇలా చూపించడంతో ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రష్మిక సినిమాలు..

రష్మిక సినిమాల విషయానికి వస్తే, తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తోంది. ఇకపోతే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యానిమల్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్న రష్మిక, కన్నడలో కూడా పలు చిత్రాలలో నటించింది. ఇక ఇప్పుడు ఇలా డీప్ ఫేక్ బారిన పడి చిక్కుల్లో పడిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు