Pooja Hegde : రష్మిక వద్దన్న సినిమా, పూజ చేస్తే ..?

ఈ మధ్య కాలంలో పూజ హెగ్డే టైం బాలేదు. ఆమె నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ‘రాధే శ్యామ్’ ‘బీస్ట్’ ‘ఆచార్య’ వంటి చిత్రాలు ఘోర పరాజయం పాలయ్యాయి. ముఖ్యంగా పూజ విషయంలో ఓ సెంటిమెంట్ బలంగా రన్ అవుతుందనేది కొందరి నెటిజెన్ల వాదన. రష్మిక రిజెక్ట్ చేసిన సినిమాలను పూజ చేస్తే కనుక ఆ సినిమా తప్పకుండా ప్లాప్ అవుతుందట.

నిజానికి ‘బీస్ట్’ మూవీ మొదట రష్మిక చేతికి వెళ్ళింది. కానీ ఆమె ఏదో సాకు చెప్పి తప్పుకుంది. దాంతో పూజ హెగ్డేని తీసుకున్నారు. ఇక ‘ఆచార్య’ విషయంలో కూడా అంతే..! చరణ్ సరసన మొదట రష్మికని అనుకున్నారు. కానీ రష్మిక అందుకు నొ చెప్పింది. కట్ చేస్తే ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది.

ఇక ‘ఎఫ్3’ లో ఓ స్పెషల్ సాంగ్ కోసం ముందుగా రష్మికని అడిగారట. అందుకు ఆమె ఏకంగా రూ.1 కోటి డిమాండ్ చేసిందట. దాంతో ఆమెను లైట్ తీసుకుని రూ.75 లక్షలకి పూజ హెగ్డేతో చేయించేస్తున్నారు అని వినికిడి. మరి రష్మిక నొ చెప్పింది కాబట్టి.. ‘ఎఫ్3’ ఫలితం కూడా తేడా కొడుతుందా లేక బ్లాక్ బస్టర్ అవుతుందా? అనేది చూడాలి..!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు